ధాన్యం సేకరణ సమస్యలపై ఢిల్లీలో బిజిబిజిగా మంత్రి గంగుల కమలాకర్

Related image

  • ముఖ్యమంత్రి ఆదేశాలతో కేంద్రంతో వరుసగా బేటీలు
  • మెన్న కేంద్ర మంత్రి, నిన్న కేంద్ర కార్యదర్శి, ఈరోజు ఎఫ్.సి.ఐ సీఎండితో బేటీ అయిన గంగుల
  • రారైస్ వల్ల యాసంగి ధాన్యం విరిగిపోయి లక్షల క్వింటాళ్లు వ్రుదా అవుతుంది
దేశ రాజదానిలో తెలంగాణ పౌరసరఫరాల శాఖ పెండింగ్ సమస్యలపై బిజీబిజీగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రైతుల పక్షపాతిగా వారికి లబ్దీ చేకూర్చే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోడనే విషయం మనందరికీ తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ పౌరసరఫరాల శాఖకు సంబందించి కేంద్రం, ఎఫ్.సి.ఐ వద్ద ఉన్న పెండింగ్ అంశాల పరిష్కారంపై మంత్రి గంగులకు స్పష్టమైన మార్గదర్శనం చేసారు. ఆ ఆదేశాల మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల ఢిల్లీలో క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు.

కేంద్రం తీసుకొనే భియ్యంలో 2020‌-21 యాసంగి సీజన్కు చెందిన బాయిల్డ్  రైస్ వాటా పెంపు, గత యాసంగి అందించాల్సిన లక్ష క్వింటాళ్ల బియ్యంపై 30 రోజులు అదనపు సీఎంఆర్ గడువు, వచ్చే వానాకాలంలో తెలంగాణలో 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు. ఈ మూడు ప్రధాన అంశాలుగా మంత్రి కేటీఆర్ తో కలిసి కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి పియూష్ గోయల్ ని  సెప్టెంబర్ 1న కలిసారు గంగుల. కేంద్ర మంత్రి సానుకూల ఆదేశాలతో గురువారం ఉదయం కేంద్ర ప్రజాపంపిణీ కార్యదర్శి సుదాన్షు పాండేను కలిసిన గంగుల సమస్యల్ని వేగంగా పరిష్కరించాల్సిన ఆవశ్యకతను వివరించారు.

ఆ వెనువెంటనే మద్యాహ్నం ఎఫ్.సి.ఐ కేంద్ర కార్యాలయంలో ఆ సంస్థ సీఎండి, ఇతర ఉన్నతాధికారులతో రాష్ట్ర సివిల్ సప్లైస్ అధికారులు బేటి అయ్యారు, దానికి కొనసాగింపుగా నేడు ఎఫ్.సి.ఐ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అతీష్ చంద్ర, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి గంగుల ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ వరుస బేటిలతో మంత్రి గంగుల కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు.

తెలంగాణ ప్రభుత్వం అడుగుతున్న న్యాయబద్దమైన అంశాలను కూలంకషంగా కేంద్రానికి వివరించారు. రైతు ఉత్సత్తులను సేకరించడంలో వ్యాపార కోణంలో మాత్రమే కాకుండా మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన అవసరముందని గుర్తుచేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దృష్టితో తీసుకున్న రైతుబందు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంటు, కాళేశ్వర జలాల అందుబాటు వంటి చర్యలు, రైతుల కోసం ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు ఇప్పుడిప్పుడే సత్పలితాలిస్తున్నాయని, ఈ సమయంలో కేంద్రం మద్దతు తెలపాల్సిన అవసరాన్ని వారికి గుర్తు చేశారు మంత్రి గంగుల.

దేశంలో కరోనా సంక్షోభంతో కోట్లాది ప్రజలు ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని, పేదలందరికీ ఆహార ధాన్యాలు అందించాల్సిన క్లిష్ట సమయంలో ఆహార వృధాను అరికట్టడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యంగా ఉండాలన్నారు. యాసంగిలో తెలంగాణలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ఆ పరిస్థితుల్లో పండిన ధాన్యాన్ని రారైస్ గా మిల్లింగ్ చేసినప్పుడు విరిగిపోయి లక్షల క్వింటాళ్ల బియ్యం పనికి రాకుండా పోతాయన్నారు. ఈ కరోనా క్లిష్ట సమయంలో అంత దాన్యాన్ని వృధా చేయడం సరికాదని అందువల్ల బాయిల్డ్ రైస్ రూపంలోనే వాటిని తీసుకోవాలని కోరారు గంగుల.

తద్వారా కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన రైతు ఆదాయం రెట్టింపుకు సైతం దోహద పడుతుందన్నారు మంత్రి గంగుల. అలాగే గత సంవత్సరాల్లో చాలా తక్కువ ధాన్యం ఉత్పత్తి జరిగినప్పుడు సైతం బాయిల్డ్ రైస్ నే అందించామని ఇప్పుడు రికార్డు స్థాయిలో దాదాపు కోటి క్వింటాళ్ల ధాన్యం దిగుబడులు వచ్చాయని గణాంకాలతో సహా కేంద్రం ముందుంచారు, ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని మిల్లింగ్ చేయడమే సవాళ్లతో కూడుకున్నదని ఇప్పుడు వాటిని రా రైస్ రూపంలో ఇవ్వడమంటే రైతుల్ని పూర్తిగా నట్టేట్లో ముంచడమే అవుతుందని కేంద్రం వద్ద తన ఆవేదనని వ్యక్తం చేసారు గంగుల.

కాబట్టి యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ గా అందించడానికి సహకరించాలని కోరారు. అలాగే గత యాసంగి సీజన్లో ఎఫ్.సి.ఐ ప్యాడి స్టాక్ వెరిఫికేషన్ కోసం దాదాపు నెలరోజులని నష్టపోవడం వల్ల 300కోట్ల విలువ చేసే లక్ష క్వింటాళ్ల బియ్యాన్ని అందించలేకపోయామని వాటిని అందించడానికి నష్టపోయిన నెలరోజులని తిరిగివ్వాల్సిందిగా కోరారు. ప్రస్థుతం నడుస్తున్న వానాకాలం సీజన్లో వరిసాగు దాదాపు 55లక్షల ఎకరాల్లో సాగువుతుందని, ఇంత పెద్ద ఎత్తున రైతులు పండిస్తున్న ధాన్యాన్ని తీసుకోవడం కోసం ఎఫ్.సి.ఐ 80 లక్షల క్వింటాళ్ల వరకు తెలంగాణకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు.

వరుసగా కేంద్ర ఆహార, ప్రజాపంపిణి శాఖ మంత్రి పియూష్ గోయల్, కేంద్ర కార్యదర్శి సుధాన్షు పాండె, ఎఫ్.సి.ఐ. సీఎండీలతో జరిపిన చర్చల్లో మంత్రి గంగుల చెప్పిన అంశాల పట్ల సానుకూలత వ్యక్తమయింది. కచ్చితంగా రైతులకు మేలు చేసే నిర్ణయం వెలువడుతందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు గంగుల కమలాకర్.

More Press Releases