ర‌హ‌దారుల నిర్మాణంపై దృష్టి సారించండి: విజయవాడ మేయర్

Related image

  • ఇంజ‌నీరింగ్ అధికారుల స‌మీక్ష స‌మావేశంలో అధికారుల‌కు మేయర్ సూచ‌న‌
  • న‌గ‌రంలో 600 కోట్లు రూపాయ‌ల‌తో అభివృద్ది ప‌నులు
విజయవాడ: న‌గ‌ర పాల‌క సంస్థ ప‌రిధిలో జ‌రుగుతున్న అభివృద్ది ప‌నుల‌పై న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం మేయ‌ర్ కార్యాల‌యంలో నిర్వ‌హించారు. ఇటివల కురిసిన భారి వర్షాల కారణంగా పాడైన రహదారులపై ప్రత్యేక దృష్టి సారించి యుద్దప్రాతిపదికన ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాలని అన్నారు. జ‌న‌ర‌ల్ ఫండ్స్‌, 14వ ఆర్థిక సంఘం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రభుత్వ గ్రాంట్లు వంటి నిధుల‌తో చేపట్టిన అభివృద్ది ప‌నులలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సత్వరమే పూర్తి చేయాలి సూచించారు.

న‌గ‌రంలో జ‌రుగుతున్న అభివృద్ది ప‌నుల‌కు సంబందించి కొన్ని పనులలో ఏర్పడిన జాప్యంనికి గల కారణాలు అడిగి తెలుసుకొని, త్వరలో క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలిస్తానని అన్నారు. నగరంలో ర‌హ‌దారులు, వీధి దీపాలు నిర్వ‌హ‌ణ‌, తాగునీరు అందించ‌డం, పార్క్ ల అభివృద్ది, మొద‌ల‌గు విష‌యాల‌పై అధికారుల‌తో చర్చించి వర్షాల కారణంగా ర‌హ‌దారుల‌పై ఏర్పడిన గోతులను త‌క్ష‌ణ‌మే పూడ్చివేసి, ప్యాచ్ వర్క్ పనులు చేపట్టాల‌న్నారు.

అదే విధంగా వివిధ ర‌హ‌దారుల నిమిత్తం అంచ‌నాలు పూర్తి ఆమోదించిన ప‌నులు కూడా  వెంట‌నే మొద‌లు పెట్టాల‌న్నారు. వీటితో పాటుగా టెండర్ ద‌శ‌లో ఉన్న ప‌నులు వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. న‌గ‌రంలో ఉన్న 32 వేల విధిదీపాల నిర్వ‌హ‌ణ‌లో ఇబ్బందులు, పాత క‌రెంట్ పోల్ వివ‌రాలు అడిగితెలుసుకొని ప‌లు సూచ‌న‌లు చేశారు.

సమావేశంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, ఎస్.ఇ లు జి.నరశింహ మూర్తి, పి.వీ.కృష్ణ భాస్కర రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు  పాల్గొన్నారు.

More Press Releases