విజయవాడలో స్పెన్సర్ మాల్ కు రూ.10వేల జరిమానా.. నోటీసులు జారీ

Related image

  • కోవిడ్ నియమాలు పాటించాలి: న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్
విజ‌య‌వాడ‌: నగరంలో అన్ని వాణిజ్య సముదాయాలలో విధిగా “ No Mask – No Enter “ కచ్చితంగా అమలు చేయాలని వ్యాపారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందని, వాటిని ఉల్లంఘించిన వారిపై జరిమానాలను విధించుట జరుగుతుంద‌ని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ పేర్కొన్నారు. శ‌నివారం సెంట్రల్ ఎక్సైజ్ కాలనీ స్పెన్సర్ మాల్‌లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేద‌నే ఫిర్యాదుపై క‌మిష‌న‌ర్ ఆదేశాల‌తో AMOH శ్రీ‌దేవి, శానిట‌రీ  ఇన్‌స్పక్టర్‌ స‌లీమ్ ఆహ్మ‌ద్‌, జిఎస్‌కె.రాయ‌ల్‌ ఆధ్వ‌ర్యంలో టీం త‌నిఖీ నిర్వ‌హించారు. మాల్‌లోకి వ‌చ్చే వారు మాస్క్ ద‌రించ‌కుండా ఉండ‌టం, గ‌డువు తీరిన వ‌స్తువులు ఉండ‌టం గ‌మ‌నించి, వారికి నోటీసులు ఇవ్వ‌డంతో పాటు 10 వేల రూపాయ‌లు జ‌రిమాన విధించారు.

కరోనా మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. కోవిడ్ తగ్గుతున్న క్రమంలో నిర్లక్ష్యం వహిస్తే, కేసులు సంఖ్య పెరిగె ప్రమాదం ఉందన్నారు. అంద‌రూ విధిగా మాస్కులు ధ‌రించాల‌న్నారు. గుంపులుగా గుమిగూడకుండా ఉండాలి. కచ్చితంగా భౌతిక దూరం పాటించాల‌న్నారు. నగరంలోని మూడు సర్కిల్ కార్యాలయాల పరిధిలో లాక్ డౌన్ సడ‌లించిన సమయాలలో ప్రజానీకం ఎవరైనా కోవిడ్ నియమాలు పాటించకుండా, మాస్క్ ధ‌రించకుండా రోడ్లపైకి వచ్చు వారిని గుర్తించి వారికీ అవగాహాన కల్పించుడంతో పాటు జరిమానాలు విధించ‌డం జ‌రుగుతుంద‌ని హెచ్చ‌రించారు. ఇందుకు గాను మూడు మొబైల్ టీమ్ ను ఏర్పాటు చేయుడం జరిగిందన్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా భాగస్వాములు కావాల‌న్నారు.

More Press Releases