సమస్యల అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: విజయవాడ మేయ‌ర్‌ రాయన భాగ్యలక్ష్మి

Related image

విజయవాడ: న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో నిర్వ‌హించిన స్పంద‌న కార్య‌క్ర‌మంలో మేయ‌ర్‌ రాయన భాగ్యలక్ష్మి పలువురు ఉన్న‌తాధికారులతో క‌లిసి ప్ర‌జ‌ల నుంచి 9 అర్జీల‌ను స్వీక‌రించారు. ప్ర‌జ‌లు సమర్పించిన అర్జీలను పరిశీలించి, నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు అందించు మౌలిక వసతులలో ప్రజలు ఎదుర్కోను సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కారించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. నేటి స్పందన కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -3, ఇంజనీరింగ్ – 2, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) – 1, పబ్లిక్ హెల్త్ – 3 మొత్తం 9 అర్జీలు స్వీక‌రించినట్లు వివ‌రించారు.

స‌మావేశంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్, ఏ.డి.హెచ్. జె.జ్యోతి, త‌దిత‌రులు ఉన్నారు.

104 పాఠశాలలో 26,188 మంది విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ: మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజ‌య‌వాడ న‌గ‌ర పాలక సంస్థ ప‌రిధిలో 104 పాఠ‌శాల‌లో జ‌గ‌న‌న్న‌ విద్యా కానుక కిట్లు పంపిణీ కార్య‌క్ర‌మం సోమ‌వారం ప్రారంభ‌మైంద‌ని మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. మన బడి నాడు–నేడు కార్యక్రమము ద్వారా స్కూల్స్ రూపురేఖలు అధుకరణ పనులు చేపటి విజయవంతముగా ఏడాది కాలం పూర్తి కాబడిన సందర్బంలో రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రిచే ప్రారంభించుట జరిగింది.

ఈ సందర్భాన్ని పురష్కరించుకొని విజయవాడ నగర పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, ఫౌండేషన్ స్కూల్స్, సంక్షేమ హాస్టల్స్, జూనియర్ కాలేజీలు కలిపి 191 స్కూల్ ఉన్నాయ‌న్నారు. ఇందులో 104 విజయవాడ నగరపాలక సంస్థ ప‌రిధిలోనివి అన్నారు. ప్రాధమిక 71, ప్రాధమికోన్నత 4, ఉన్నత పాఠశాలలు 29 స్కూల్స్‌లో నేడు ఈ విద్యా కానుకలు అందించుట జరుగుతుందని మేయర్ పేర్కొన్నారు.

నగరంలోని పశ్చిమ నియోజక వర్గ పరిధిలో గల 44 మునిసిపల్ పాఠశాలలో చదువుకోను బాలురు 3241, బాలికలు 3338 మొత్తం 6579 విద్యార్థులు జగనన్న విద్యాకానుక లబ్ధి పొందుతున్నారన్నారు. అదే విధంగా సెంట్రల్ నియోజకవర్గంలోని 28 మునిసిపల్ పాఠశాలలోని విద్యార్థులు బాలురు 5996, బాలికలు 5727 మొత్తం 11623, తూర్పు నియోజకవర్గం పరిధిలోని 32 మునిసిపల్ పాఠశాల యందలి బాలురు 4017, బాలికలు 3969 మొత్తం 7986 విద్యార్ధులకు జగనన్న విద్యాకానుక లబ్ధి పొందుతున్నారన్నారు.

నగర పరిధిలోని 104 నగరపాలకసంస్థ పాఠశాలల్లో మొత్తం 26,188 విద్యార్ధులకు జగనన్న విద్యాకానుక కిట్లు అందించుట జరిగింద‌న్నారు. 1-5వ తరగతి విద్యార్ధులకు మూడు జతల యునిఫారం మెటిరియల్, రెండు చిన్న సైజు బ్యాగ్, బెల్ట్, ఒక‌ జాత బూట్లు, రెండు జతల సాక్స్ లు, తరగతి పుస్తకాలతో పాటుగా ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నిఘoటువు డిక్షనరీతో కూడిన కిట్ లను అందించుట జరిగింద‌న్నారు.

అదే విధంగా 6-10వ తరగతి విద్యార్ధులకు మూడు జతల యునిఫారం మెటిరియల్, రెండు చిన్న సైజు బ్యాగ్, బెల్ట్, 1 జాత బూట్లు, రెండు జతల సాక్స్ లు, తరగతి పుస్తకాలతో పాటుగా ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ నిఘoటువు డిక్షనరీతో పాటుగా నోట్ బుక్స్ తో కూడిన కిట్స్ అందించుట జరుగుతుందని పేర్కొన్నారు.

న‌గ‌రంలో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ పరిధిలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ నందు మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు, సెంట్ర‌ల్‌ నియోజకవర్గ పరిధిలో సత్యనారాయణపురం ఏ.కె.టి.పి.యం హైస్కూల్ నందు శాసన సభ్యుడు మ‌ల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ పరిధిలో కృష్ణలంక ఏ.పి.ఎస్.ఆర్.యం హైస్కూల్ నందు దేవినేని అవినాష్ ఆధ్వ‌ర్యంలో విద్యార్ధులకు జగనన్న కిట్ లు పంపిణీ జ‌రిగిన్న‌ట్లు తెలిపారు.

More Press Releases