మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు: ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు

Related image

విజ‌యవాడ‌: సీఎం వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నారని సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు అన్నారు. అమ్మాయిలు, మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన 'దిశ ఎస్ఓఎస్' యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడమే కాదు.. 'దిశ ఎస్ఓఎస్' యాప్ ద్వారా ఆకతాయిల ఆటకట్టిస్తున్న కేసులు చాలా న‌మోదు అవుతున్నాయ‌న్నారు.

ఈ యాప్‌లో అమ్మాయిలు, మహిళల రక్షణకు ఉపయోగపడే అనేక ఫీచర్స్ ఉన్నాయి. 'దిశ ఎస్ఓఎస్' యాప్ మొదటిసారి డౌన్‌లోడ్ చేయడానికి మాత్రమే ఇంటర్నెట్ అవసరం. యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఉపయోగించడానికి ఇంటర్నెట్ అవసరం లేదు. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్‌తో లాగిన్ చేయాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత సమాచారం. ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ లాంటి వివరాలు అప్‌డేట్ చేయాలి. ఆపదలో ఉన్నప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసి ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. యాప్ ఓపెన్ చేసి ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసేంత సమయం లేకపోతే ఫోన్‌ని గట్టిగా ఊపినా చాలు. మీరు ఎక్కడున్నారో లొకేషన్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందుతుంది.

అంతేకాదు.. మీరు ఉన్న లొకేషన్ 10 సెకండ్ల వీడియో కూడా కమాండ్ రూమ్‌కు వెళ్తుంది. మీరు ఉన్న లొకేషన్ ఆధారంగా దగ్గర్లో అందుబాటులో ఉన్న పోలీస్ రక్షక్ వాహనాలకు, పోలీస్ స్టేషన్లకు సమాచారం వెళ్తుంది. పోలీస్ రక్షక్ వాహనాలు జీపీఎస్ ద్వారా మీరు ఉన్న ప్రాంతానికి చేరుకుంటాయి. మీరు ఆపదలో ఉన్నప్పుడు మీ ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లో ఉన్న మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల నెంబర్లకు కూడా సమాచారం వెళ్తుంద‌న్నారు. మహిళల భద్రత, కాలేజీ విద్యార్థులు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండాలంటే దిశా గురించి తెలిసి ఉండాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో  స్థానిక సీఐ హనీష్ బాబు, వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు త‌దిత‌రులు ఉన్నారు.

More Press Releases