రేషన్ కార్డ్ ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి

Related image

హైదరాబాద్: తెలంగాణ కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డి ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలోని బొడుప్పల్, పీర్జాది గూడ మున్సిపల్ కార్పొరేషన్లలో, ఘట్కేసర్, పోచారం, మేడ్చల్, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలలో మరియు ఘట్కేసర్, కీసర, మూడు చింతలపల్లి, శామిర్పెట్, మేడ్చల్ మండలాలలో నూతన ఆహార భద్రత కార్డుల (రేషన్ కార్డ్)ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఇప్పటికే 4,94,609 కార్డులు ఉండగా 30,055 నూతన రేషన్ కార్డులను మంజూరు చేయడం జరిగింది. నేటి నుండి 30వ తేదీ వరకు ఈ రేషన్ కార్డుల పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 3,60,000 పై చిలుకు మంది లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు అందజేసే కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రారంభించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమాభివృద్ది కార్యక్రమాలు తీసుకువచ్చారని గుర్తు చేస్తూ నేడు పేదలకు అద్బుతంగా సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని కొనియాడారు. ఆగస్ట్ నెల నుండి నూతన రేషన్ కార్డుదారులందరికి బియ్యం సరఫరా చేయడం జరుగుతుంది. మిగతా దరఖాస్తు దారులకు మరియు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి తప్పకుండా మరోమారు అవకాశం ఉంటుందని, రేషన్ షాపులను కూడా పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నర్సింహారెడ్డి, మేయర్లు బుచ్చిరెడ్డి, వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్లు లక్ష్మీ గౌడ్, శివ గౌడ్, మున్సిపల్ చైర్మన్లు పావని యాదవ్, కొండల్ రెడ్డి, దీపికా నర్సింహారెడ్డి, లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేష్, డీసీ ఎమ్మెస్ వైస్ ఛైర్మన్ మధుకర్ రెడ్డి, జడ్పీటీసీలు అనిత లాలి, శైలజ విజేందర్ రెడ్డి, ఎంపీపీలు సుదర్శన్ రెడ్డి, ఇందిరా లక్ష్మీ నారాయణ, హారిక మురళీ గౌడ్, పద్మ జగన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు,సర్పంచ్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు,ముఖ్య నాయకులు, రెవెన్యూ, సివిల్ సప్లై అదికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More Press Releases