చేనేతల అభ్యున్నతి కోసం శ్రమించిన ప్రగడ కోటయ్య: ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి

26-07-2021 Mon 15:52

  • ఘనంగా చేనేత ఉద్యమ నేత 106వ జయంతి
  • 75 రోజుల పాటు సత్యాగ్రహం, జైలు శిక్ష
విజయవాడ: చేనేతల అభ్యున్నతి కోసం తుదికంటా శ్రమించిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగ మోహనరావు పిలుపునిచ్చారు. అఖిల భారత చేనేత ఉద్యమనేత, మాజీ పార్లమెంటు సభ్యుడు, చేనేత కీర్తి పతాక ప్రగడ కోటయ్య 106వ జయంతిని పురస్కరించుకొని విజయవాడలోని ఆప్కో కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రగడ కోటయ్య చిత్రపటానికి ఛైర్మన్ మోహనరావు, అధికారులు, సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆప్కో ఛైర్మన్ మోహనరావు మాట్లాడుతూ.. ఒకప్పుడు స్వర్ణయుగాన్ని చూసి, ఒకానొక దశలో కనీవినీ ఎరుగని రీతిలో ఇబ్బందులు ఎదుర్కున్న చేనేత రంగాన్ని తన అలుపెరుగని ఉద్యమాల ద్వారా తిరిగి జవసత్వాలు తీసుకు వచ్చిన మహానుభావుడు శ్రీ ప్రగడ కోటయ్య అని అన్నారు. రైతు బాంధవులు ప్రొఫెసర్‌ ఎన్‌.జి. రంగా శిష్యునిగా ఉంటూ మద్రాసు టెక్స్‌టైల్‌ కళాశాలలో శిక్షణ పొంది చేనేత సహకార రంగంలో ఉద్యోగంలో చేరి సహకార రంగ వృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు.

చేనేత వాణి అనే వారపత్రిక ద్వారా చేనేతల సమస్యలను రాష్ట్రమంతటా వినిపించారని గుర్తు చేశారు. 1952లో ఉమ్మడి మద్రాసు శాసనసభసభ్యుడిగా చేనేత వృత్తి పరిరక్షణకు ప్రగడ కోటయ్య ఎంతగానో కృషి చేశారన్నారు. 1950లో 75 రోజుల పాటు సత్యాగ్రహం నిర్వహించి, జైలు శిక్ష అనుభవించారన్నారు.

1953లో టంగుటూరు ప్రకాశం పంతులు ప్రభుత్వం చేనేత నిల్వలు కొనుగోలు చేయాలనే డిమాండ్‌తో ఆయన ఉద్యమించారని గుర్తు చేశారు. 1952లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ప్రకాశం పంతులు స్థాపించిన కృషీకార్‌ లోక్‌ పార్టీ ద్వారా శాసనసభ్యునిగా అఖండ విజయం సాధించి, సాధారణ ఎన్నికలలో చీరాల నుంచి శాసన సభ్యునిగా, 1974 నుంచి 1980 వరకు శాసనమండలి సభ్యులుగా 1990లో రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారన్నారు.

ప్రగడ కోటయ్య 70వ జన్మదినోత్సవం సందర్భంగా చీరాలలో బెజవాడ గోపాలరెడ్డి చేతుల మీదుగా ‘ప్రజా బంధు’ బిరుదు ప్రధానం చేశారన్నారు. యాభై శాతంగా ఉన్న పేద గ్రామీణ వృత్తిదారులను వెనుకబడిన వర్గాలుగా గుర్తించి చట్టసభలలో తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగానికి సరసమైన ధరలకు నూలు అందించాలనే ఉద్దేశంతో 11 చోట్ల సహకార నూలు మిల్లులు స్థాపింపచేశారన్నారు. జీవితాంతం బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి అవిశ్రాంత పోరాటం చేసిన ప్రగడ కోటయ్య చేనేత రంగ అభ్యున్నతికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని మోహనరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్కో జీఎం లేళ్ల రమేష్ బాబు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  


More Press Releases
Audi India amps up electric vehicle drive with the launch of India’s first electric supercars
18 minutes ago
Zolve launches first ever neobank to offer credit cards, bank accounts to US immigrants upon arrival
1 hour ago
Goalkeeper Manas Dubey joins TRAU FC on loan
4 hours ago
కొండ ప్రాంతాలలో యూజీడీ వ్యవస్థను మెరుగుపరచాలి: విజ‌య‌వాడ‌ మేయర్, కమిషనర్ ప్రసన్న వెంకటేష్
4 hours ago
PM’s Departure Statement ahead of his visit to USA
10 hours ago
వైన్ షాప్ ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు చరిత్రాత్మకం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
1 day ago
సచివాలయ హెల్త్ సెక్రెటరీలకు మెడికల్ కిట్స్ పంపిణీ చేసిన విజయవాడ మేయర్, కమిషనర్
1 day ago
Yamaha recreates the ‘Racing Spirit’ with the New YZF-R15 V4 & YZF-R15M
1 day ago
Yamaha launches the iconic AEROX 155 maxi sports scooter
1 day ago
దేశానికే తెలంగాణ విద్య మార్గదర్శనం కావాలి: మంత్రి జగదీష్ రెడ్డి
1 day ago
8th edition of Flipkart Big Billion Days 2021
1 day ago
Telangana Covid Vaccination update as on 20.09.2021 at 09PM
1 day ago
Telecall between Defence Minister Rajnath and US Secretary of Defence
2 days ago
Telangana Covid Vaccination update as on 19.09.2021 at 09 PM
2 days ago
PayPoint India, Bank of Baroda tie-up to widen reach of banking services
2 days ago
HCL Technologies to Drive Digital Speed, Transformation for MKS Instruments
2 days ago
Infinix launches Hot11 series with Hot11s being the best display in segment
2 days ago
​TCL Cricket Festival 2021 is Back
2 days ago
స్పందనలో 11 అర్జీలు స్వీకరణ: విజ‌య‌వాడ‌ మేయర్
2 days ago
Jeevansathi.com ropes in Superstar Mahesh Babu for its #WeMatchBetter campaign
2 days ago
Rentokil PCI launches Mosquito Control Innovation to keep Mosquito-borne diseases at bay
2 days ago
Master Bhuvan from India becomes youngest to scale Mount Elbrus
2 days ago
PM expresses gratitude to President, VP and other world leaders for birthday wishes
5 days ago
Punjab National Bank cuts home loan rates
5 days ago
ఆయిల్ పామ్ విత్తనాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించండి: తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్
5 days ago
Advertisement
Video News
ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధూను సీఎం కానివ్వను.. తేల్చిచెప్పిన అమరీందర్ సింగ్
ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధూను సీఎం కానివ్వను.. తేల్చిచెప్పిన అమరీందర్ సింగ్
20 minutes ago
Advertisement 36
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: 7 గంటలపాటు సాగిన తరుణ్‌ విచారణ
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: 7 గంటలపాటు సాగిన తరుణ్‌ విచారణ
44 minutes ago
ప్రజలు మాటల మనిషి చంద్రబాబును కోరుకోవడం లేదు.. చేతల మనిషి జగన్ కావాలంటున్నారు: మంత్రి వెల్లంపల్లి
ప్రజలు మాటల మనిషి చంద్రబాబును కోరుకోవడం లేదు.. చేతల మనిషి జగన్ కావాలంటున్నారు: మంత్రి వెల్లంపల్లి
1 hour ago
జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ అభియోగ పత్రాలపై సీబీఐ కోర్టు విచారణ ప్రారంభం
జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ అభియోగ పత్రాలపై సీబీఐ కోర్టు విచారణ ప్రారంభం
1 hour ago
ప్రభాస్ .. పూజ హెగ్డే మధ్య ఎలాంటి గొడవా లేదంటున్న మేకర్స్!
ప్రభాస్ .. పూజ హెగ్డే మధ్య ఎలాంటి గొడవా లేదంటున్న మేకర్స్!
2 hours ago
మోదీ, కేసీఆర్ వల్ల దేశం, రాష్ట్రం ప్రమాదంలో పడ్డాయి: రేవంత్ రెడ్డి ఫైర్
మోదీ, కేసీఆర్ వల్ల దేశం, రాష్ట్రం ప్రమాదంలో పడ్డాయి: రేవంత్ రెడ్డి ఫైర్
2 hours ago
ఏపీలో మరో 1,365 మందికి కరోనా పాజిటివ్
ఏపీలో మరో 1,365 మందికి కరోనా పాజిటివ్
2 hours ago
బీజేపీ లేకపోతే ఇక అది తాలిబన్ ప్రభుత్వమేనా?: కాషాయ పార్టీ నేతలపై సంజయ్ రౌత్ ఫైర్
బీజేపీ లేకపోతే ఇక అది తాలిబన్ ప్రభుత్వమేనా?: కాషాయ పార్టీ నేతలపై సంజయ్ రౌత్ ఫైర్
2 hours ago
దసరాకి మరింత పెరుగుతున్న పోటీ!
దసరాకి మరింత పెరుగుతున్న పోటీ!
2 hours ago
ఒక్క డిమాండ్‌తో అంతర్జాతీయంగా ఒంటరైపోయిన పాకిస్థాన్!
ఒక్క డిమాండ్‌తో అంతర్జాతీయంగా ఒంటరైపోయిన పాకిస్థాన్!
3 hours ago
రేపు చరణ్ చేతుల మీదుగా 'అనుభవించు రాజా' టీజర్!
రేపు చరణ్ చేతుల మీదుగా 'అనుభవించు రాజా' టీజర్!
3 hours ago
ఇలా ఓడిపోవడం పంజాబ్‌కు అలవాటుగా మారింది: కుంబ్లే
ఇలా ఓడిపోవడం పంజాబ్‌కు అలవాటుగా మారింది: కుంబ్లే
3 hours ago
'వరుడు కావలెను' నుంచి లిరికల్ వీడియో సాంగ్!
'వరుడు కావలెను' నుంచి లిరికల్ వీడియో సాంగ్!
3 hours ago
చీర కట్టుకుందని రెస్టారెంట్లోకి రానివ్వని సిబ్బంది.. మండిపడుతున్న నెటిజన్లు
చీర కట్టుకుందని రెస్టారెంట్లోకి రానివ్వని సిబ్బంది.. మండిపడుతున్న నెటిజన్లు
4 hours ago
సోనీ-జీ కంపెనీల మధ్య విలీన ఒప్పందం
సోనీ-జీ కంపెనీల మధ్య విలీన ఒప్పందం
4 hours ago
తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
తీవ్ర ఒడిదుడుకుల మధ్య నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
5 hours ago
సమస్య కొవిషీల్డ్‌ కాదు.. భారత సర్టిఫికెట్: యూకే మెలిక
సమస్య కొవిషీల్డ్‌ కాదు.. భారత సర్టిఫికెట్: యూకే మెలిక
5 hours ago
‘గాడ్​ ఫాదర్​’గా రంగంలోకి దిగేసిన చిరూ
‘గాడ్​ ఫాదర్​’గా రంగంలోకి దిగేసిన చిరూ
6 hours ago
ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో స్కామ్ జరిగింది: ఏసీబీ
ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీలో స్కామ్ జరిగింది: ఏసీబీ
6 hours ago
ఇంకోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే సంగతి చూస్తాం: టీఆర్ఎస్ శ్రేణులకు సీపీఐ నారాయణ వార్నింగ్
ఇంకోసారి ఇలాంటి దాడులకు పాల్పడితే సంగతి చూస్తాం: టీఆర్ఎస్ శ్రేణులకు సీపీఐ నారాయణ వార్నింగ్
6 hours ago