ప్రతి లబ్ధిదారుడు ఆనందపడేలా నివాస గృహాలు: మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు

Related image

  • జగనన్న కాలనీలలో ఇళ్ల‌ నిర్మాణానికి  భూమి పూజ
విజ‌య‌వాడ‌: పేద వాడి సొంత ఇంటి క‌ల‌ను నేర‌వేర్చాల‌ని సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌యంలో రాష్ట్రంలో దాదాపు 31 లక్షల ఇళ్లు త్వరలో నిర్మించి ఇవ్వటం చాలా గొప్ప విషయం అని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ‌ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. ఇళ్లు మెగా గ్రౌండింగ్‌ డ్రైవ్‌లో భాగంగా గురువారం కృష్ణాజిల్లా జి కోండూరు వ‌ద్ద వెల‌గ‌లేరులో జ‌గ‌నన్న‌ కాలనీల నిర్మాణానికి మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు, స్థానిక ఎమ్మెల్యే వ‌సంత కృష్ణాప్రసాద్‌, విజ‌య‌వాడ‌ న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్ ఐ.ఎ.ఎస్ (JC) కార్పొరేట‌ర్లు వెల‌గ‌లేరు స‌ర్పంచ్, హౌసింగ్ అధికారులు మ‌రిము న‌గ‌ర పాల‌క సంస్థ అధికారుల‌తో క‌లిసి మంత్రి భూమి పూజ చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా జగనన్న కాలనీల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ప్రతి లబ్ధిదారుడు ఆనందపడేలా నివాస గృహాలు ఉంటాయని తెలిపారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఏపీలో పేదలందరికీ ప్రభుత్వం ఇళ్లు మెగా గ్రౌండింగ్‌ డ్రైవ్‌ను చేపట్టింది. గురువారంతో పాటు, ఈ నెల 3, 4 తేదీల్లో అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున గృహనిర్మాణ శంకుస్థాపనలు జరగన్నాయి. రోజుకు లక్ష ఇళ్ల చొప్పున మూడు రోజుల్లో 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున గృహనిర్మాణ శంకుస్థాపనలు జగరనున్నాయని అన్నారు.

రాష్ట్రంలో దాదాపు  31లక్షల ఇళ్ల‌ప‌ట్టాలు లేదా ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డానికి జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టుంద‌న‌న్నారు. అందులో భాగంగా ప‌శ్చిమలో 35 వేల కుటుంబాల‌కు ఇళ్లు, ఇళ్లు స్థ‌లాలు ఇవ్వ‌డం జ‌రుగుతుంద‌న్నారు. మొద‌టి భాగం 11 వేల మందికి ఏడాదిలో ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టింద‌న్నారు. అందులో భాగంగా ఈ రోజు వెల‌గ‌లేరులో దాదాపు 9 వేల మందికి హౌసింగ్ లేఆవుట్లు వేస్తున్నామన్నారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో దాదాపు 35 వేల మందికి నిర్ణ‌యిత కాల‌ప‌రిమితిలో ఇళ్లు నిర్మాణం పూర్తి చేస్తామ‌న్నారు. దీనిని కూడా కొంద‌రు కావాల‌ని రాజ‌కీయం చేస్తున్నార‌న్నారు.

అంద‌రి క‌ల‌ను నేర‌వేర్చిన సీఎం జ‌గ‌న‌న్న: మేయ‌ర్‌

పేద‌వాడి సొంత ఇంటిక‌లను నిజం చేయ‌డం జ‌గ‌న‌న్న‌కే సాధ్యం అని, అంద‌రి సొంత ఇంటి క‌ల నిజం కాబోతుంద‌ని విజ‌య‌వాడ న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి అన్నారు. ఈ రోజు వెల‌గ‌లేరులో దాదాపు 800 మందికి ఇళ్లు నిర్మాణానికి భూమి పూజ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. న‌గ‌రంలో స్థ‌లం లేక‌పోవ‌డంతోనే ఇక్క‌డ జ‌గ‌నన్న కాల‌నీ కాదు.. అత్యంత అద్భ‌త‌మైన న‌గరమే నిర్మిస్తున్నామ‌న్నారు. మంచి వాత‌వార‌ణంలో ఇళ్లు నిర్మించుకొవ‌డానికి ఇసుక‌, ఇటుక, సిమెంట్ త‌దిత‌ర ప‌రిక‌రాల‌ను త‌క్కువ ధ‌ర‌కు నాణ్య‌మైన‌వి అందిస్తామ‌న్నారు.

మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్‌

ప‌శ్చిమ‌లో 35 వేల‌ కుటుంబాలకు స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా, ఆ ఇళ్లపట్టాలు సహా ఇళ్లు కట్టించే కార్యక్రమానికి  ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగా మొద‌టి ద‌శ‌లో 11వేల మందికి ఇళ్లు నిర్మించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు క‌మిష‌న‌ర్ వివ‌రించారు. ఇళ్లు నిర్మించే ప్రాంతంలో తాగునీరు పైపులైన్‌, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ సౌకర్యం, అండర్‌ గ్రౌండ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామని, పార్కులు, విలేజ్‌ క్లినిక్లు, గ్రామ సచివాలయాలు, స్కూళ్లు.. తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇళ్లు మంజూరైన వారికి ప్రభుత్వం మూడు ఆప్షన్లు ఇచ్చిందని, ఆప్షన్లు ఎంచుకునే వెసులుబాటును ఇచ్చామని, దీని ప్రకారం నిర్మాణాలు జ‌రుగుతాయ‌న్నారు.

More Press Releases