ap7am logo

ఒకినావా నుండి ఆకర్షణీయమైన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్!

Fri, Sep 06, 2019, 12:00 PM
Related Image ఒకినావా PraisePro రూ.71,990 వద్ద లాంఛ్ చేయబడింది. ఒక్కసారి ఛార్జింగ్ చేయడం ద్వారా 90-110km వరకు ప్రయాణించవచ్చు.

 • సింగిల్ డిటాచబుల్ లిథియం- అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. తద్వారా మీ ఇల్లు లేదా ఆఫీసు వద్ద ఎంతో సౌకర్యవంతంగా ఛార్జింగ్ చేసుకోవచ్చు

 • లాంగ్ రేంజ్– స్పోర్ట్స్ మోడ్‌లో ఎఆర్ఎఐ ప్రకారంగా 90 km/ఛార్జ్, ఎకో మోడల్‌లో 110 km/ఛార్జ్

 • తన ఆడియెన్స్‌ని మరింత విస్త్రృతం చేసుకోవడానికి కొత్త చౌక అయిన PraisePro ఈ స్కూటర్ సాయపడుతుంది 

 • రెండు రంగుల్లో లభ్యం – గ్లాసీ రెడ్ బ్లాక్, గ్లాసీ స్పార్కెల్ బ్లాక్

 • ఒకినావా PraisePro కొరకు రోడ్డు సైడు సాయం కార్యక్రమం లభ్యం

ఒకినావా స్కూటర్స్-s - ఫేమ్-II ఆమోదాన్ని పొందిన మొదటి కంపెనీ. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ మీద దృష్టి సారించే భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ. ఒకినావా తన యొక్క సరికొత్త PraiseProని ఎక్స్. షోరూమ్ ధర రూ.71,990లకు ధర వద్ద లాంఛ్ చేసింది. భారతీయ వినియోగదారుల డిమాండ్‌ని అందేవిధంగా ఇప్పటి వరకు శీతకన్నేసిన మాస్ కమ్యూటింగ్ సెగ్మెంట్‌ని అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఒకినోమా గ్లాసీ రెడ్ బ్లాక్, గ్లాసీ స్పార్కెల్ బ్లాక్‌ మోడల్స్‌ని అందిస్తోంది. ఒకినావా PraisePro కొరకు రోడ్డుసైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్‌ కూడా అందిస్తోంది. ప్రొడక్ట్ యొక్క క్లాసీ లుక్, వైబ్రెంట్ ఫీల్ ఈ సెగ్మెంట్‌ను ఇప్పటి వరకు మిస్ అయిన భావన కలిగిస్తుంది. ఈ శ్రేణిలో ఆకర్షణీయమైన రంగులు, శైలితో సమ్మిళితమైన సరికొత్త చౌకైన PraisePro పోటీదారుల కంటే ఎంతో ఎత్తున నిలుస్తుంది. కొత్తతరం #Okinawaelectricswagతో ఈవి లైఫ్ స్టైల్‌ని అనుసరించేందుకు దోహదపడుతుంది.

ఈ స్కూటర్ పాన్ ఇండియాలోని వారి డీలర్‌షిప్‌ల వద్ద ఇప్పటికే గణనీయమైన బుకింగ్‌లను పొందింది. ఒకినావా స్కూటర్‌లు అత్యుత్తమంగా పనిచేయడం వల్ల దీనికి భారతదేశంలోని కొండ ప్రాంతాల నుంచి కూడా చక్కటి ప్రతిస్పందన లభ్యమైంది. PraisePro దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీలర్‌ షిప్‌ల్లో లభిస్తుంది. PraiseProలో 1000-వాట్‌ల బిఎల్‌డిసి వాటర్ ప్రూఫ్ మోటార్ ఉంది. దీనికి 2.0KWH డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ద్వారా పవర్ అందించబడుతుంది. స్కూటర్ యొక్క పీక్ పవర్ 2500 వాట్‌లు. 2-3 గంటలపాటు ఛార్జింగ్ చేయడం ద్వారా PraisePro స్పోర్ట్స్ మోడ్‌లో ఎఆర్ఎఐ ప్రకారంగా 90 km/ఛార్జ్‌ని అదేవిధంగా ఎకో మోడల్‌లో 110 km/ఛార్జ్‌ని అందిస్తుంది. డిజిటల్ స్పీడోమీటర్‌లో మూడు మోడ్‌లు ఉన్నాయి. ఎకానమీ, ఇది 30-35kmph స్పీడ్‌ని అదిస్తుంది. స్పోర్ట్స్, ఇది 50-60kmph స్పీడ్‌ని అందిస్తుంది. టర్బో 65-70kmph స్పీడ్‌ని అందిస్తుంది. ఈ-స్కూటర్‌ 15 డిగ్రీల వరకు ఉండే గ్రేడియెంట్‌లను ఎక్కే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

PraisePro దిగువ పేర్కొన్న ఫీచర్లతో పాటుగా ఖాతాదారులకు ఒక అత్యాధునిక డిజైన్‌ని అందిస్తుంది:

 • యాంటీ-థెఫ్ట్ అలారంతో సెంట్రల్ లాకింగ్

 • తాళం లేని ప్రవేశం

 • నా స్కూటర్‌ని కనుగొనే ఫంక్షన్

 • మొబైల్ ఛార్జింగ్ యుఎస్‌బి పోర్ట్

 • మోటార్ వాకింగ్ అసిస్టెంట్ (ఫ్రంట్/రివర్స్ మోషన్)

 • రోడ్డు సైడ్ సాయం

150కిగ్రాల లోడింగ్ సామర్ధ్యం, సీటు కింద స్టోరేజీ స్థలంతోపాటుగా ఈ- స్కూటర్ గ్లాసీ రెడ్ బ్లాక్, గ్లాసీ స్పార్కెల్ బ్లాక్ కలర్ ఆప్షన్‌ల్లో లభ్యం అవుతుంది.

లాంఛ్ సందర్భంగా జితేందర్ శర్మ, వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్, ఒకినావా ఆటోటెక్ ప్రయివేట్ లిమిటెడ్. మాట్లాడుతూ, ‘‘ దేశంలో ఈవిలను ఆమోదించేందుకు ఒక విస్ఫోటనాత్మక ఎదుగుదల సృష్టించేందుకు ఖాతాదారులకు అత్యుత్తమ ఉత్పత్తులు, పరిష్కారాలను అందించేందుకు ఒకినావా ఎంతగానో కృషి చేస్తుంది. భారతీయ వినియోగదారుల డిమాండ్‌ని చేరుకోవడానికి, మాస్ కమ్యూటింగ్ సెగ్మెంట్‌ని క్యాప్చర్ చేయడానికి, మా ఖాతాదారులకు పెట్రోల్ స్కూటర్‌కు పోటీగా నిలిచే ఒక ఉత్పత్తిని ప్రవేశపెట్టాలని కోరుకుంటున్నాం.

 PraisePro మాస్ మార్కెట్‌కు సేవలందిస్తుంది ఎందుకంటే ధర, సౌందర్యం, రేంజ్, డబ్బుకు తగ్గ విలువతో సెగ్మెంట్‌లోనే అత్యుత్తమంగా నిలుస్తుంది. వేరే చేయగల లిథియం-అయాన్ బ్యాటరీలు బ్యాటరీ ఛార్జింగ్‌, ఛార్జింగ్ చేయడానికి పట్టే సమయానికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. ఆఫీసుకు వెళ్లేవారు, కుటుంబాలకు సంబంధించిన రోజువారీ ప్రయాణ అవసరాలను ఈ ప్రొడక్ట్ తీరుస్తుంది. మా స్కూటర్‌లు డెలివరీ సర్వీస్ ఫ్లాట్‌ఫారాల ద్వారా కూడా ఉపయోగించబడుతున్నాయి. ఇప్పుడు మా కొత్త PraisePro బిబిబి సెగ్మెంట్ నుంచి చాలా చక్కటి ప్రతిస్పందన పొందుతోంది.

భారతదేశంలో భవిష్యత్తులో స్థిరమైన, ధారణీయమైన మొబిలిటీ అయిన ఈ మొబిలిటీకి మాత్రమే భవిష్యత్తు ఉందని మేం విశ్వసిస్తున్నాం. ఫేమ్ II వంటి ప్రభుత్వం చేపట్టిన చర్యల ద్వారా, ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలపై అదనంగా రూ. 1.5 లక్షల వరకు అదనపు ఆదాయపన్ను మినహాయించబడుతుంది. జిఎస్‌టి రేటులో 7% తగ్గింపు, మరియు ఛార్జర్ లేదా ఛార్జింగ్ స్టేషన్‌ల కొరకు ఈవిలపై 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం వల్ల భారతీయ వినియోగదారులు భారతదేశంలో తయారు చేసిన అత్యంత చౌకైన ఈ వేహికల్స్‌ని పొందగలుగుతారు’’ అని శర్మ తెలిపారు.

ఉత్పత్తి స్పెసిఫికేషన్‌:


రేంజ్

స్పోర్ట్స్ మోడ్‌లో ఎఆర్ఎఐ ప్రకారంగా 90 km/ఛార్జ్ మరియు ఎకో మోడల్‌లో 110 km/ఛార్జ్

లోడింగ్ సామర్ధ్యం

150kg

రంగులు

గ్లాసీ రెడ్ బ్లాక్ మరియు గ్లాసీ స్పార్కెల్ బ్లాక్

బ్యాటరీ వారెంటీ

3 సంవత్సరాలు లేదా 20000 km (ఏది ముందు అయితే అది)

మోటార్ వారెంటీ

3 సంవత్సరాలు

పీక్ పవర్

2500వాట్

వేగం

ఎకానమీ: 30-35kmph; స్పోర్ట్స్: 50-60kmph; టర్బో: 65-70kmph

ఓల్టేజీ

72V

క్లైంబింగ్ డిగ్రీ

15 డిగ్రీలు

ఫైనాన్సింగ్ పార్టనర్‌లు

మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మరియు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు ఒకినావా గురించి:

ఒకినావా ఆటోటెక్ ప్రయివేట్ లిమిటెడ్ అనేది భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ కంపెనీ, ఇది స్థిరమైన మరియు ధారణీయమైన భవిష్యత్తు దిశగా మన వర్తమానాన్ని నడిపించే విద్యుత్ టూ వలర్‌లను సృష్టించాలనే లక్ష్యంతో 2015లో ఏర్పాటు చేయబడింది.

జితేందర్ శర్మ, రూపాలి శర్మ ద్వారా రూపొందించబడ్డ ఒకినావా తయారీ కేంద్రం, భివాండీ, రాజస్థాన్‌లో ఉంది. అత్యంత వేగవంతమైన ఈ- స్కూటర్‌లు మరియు బైక్‌లను తయారు చేసే అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న భారతీయ ఆటోమొబైల్ కంపెనీల్లో ఇది ఒకటి. “పవర్ ద ఛేంజ్’’ మరియు “పర్యావరణానికి పరిష్కారం” అనే కార్పొరేట్ తాత్త్వికతతో,  ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పు దిశగా ఒకినావా ధైర్యంగా ముందడుగు వేసింది. ప్రముఖ విదేశీ కంపెనీతో కుదుర్చుకున్న సాంకేతిక ఒప్పందం ద్వారా అత్యాధునిక సాంకేతికత సాయంతో ఇది అత్యంత వేగవంతమైన ఈవిలను తయారు చేస్తుంది.

భద్రత విషయంలో రాజీపడకుడా అత్యంత వేగంగా ప్రయాణించడం అనేది ఒకినావా ఎలక్ట్రిక్ టూ వీలర్ బైక్‌ల యొక్క అత్యంత ప్రధానమైన లాభదాయక విషయాల్లో ఒకటి. సంప్రదాయ ఇంధనాలపై నడించే వాహనాల పనితీరు స్థాయికి ఈ బైక్‌లు సరితూగవు అనే అపోహలకు ఈ వాహనాలు అడ్డుకట్ట వేస్తాయి. ఓకినోవా దిగువ పేర్కొన్న ‘3 సూత్రాలు’ ద్వారా ప్రకృతిని కాపాడే లక్ష్యాలతో పర్యావరణానికి స్నేహపూర్వకమైన, ధారణీయమైన మరియు సామాజిక బాధ్యత కలిగిన మోడల్‌పై పనిచేస్తుంది. గో గ్రీన్, భూమాతను కాపాడటం మరియు భూమండలంపై కార్బన్ డై ఆక్సైడ్‌ని తగ్గించడం. 

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)