రైతాంగానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్: తెలంగాణ పౌరసరఫరాల సంస్థ చైర్మన్

Related image

  • వరిసాగు, దిగుబడి, కొనుగోళ్లల్లో సరికొత్త రికార్డు
  • లక్ష్యానికి మించి ధాన్యం సేకరణ
  • 19 జిల్లాల్లో వంద శాతానికి పైగా కొనుగోళ్లు:పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
హైదరాబాద్:ఉమ్మడి రాష్ట్రంలో గుక్కెడు నీటికి... బుక్కెడు బువ్వకేడ్చిన తెలంగాణ రైతాంగం నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అండదండలతో తెలంగాణ రైతులు ఈ ఏడాది యాసంగిలో వరిసాగు, దిగుబడుల్లో రికార్డులను సృష్టించారని అన్నారు. సోమవారంనాడు పౌరసరఫరాలభవన్లో ఛైర్మన్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది యాసంగిలో లక్ష్యానికి మించి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. 80 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 82 (101 శాతం) లక్షలు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. కరోనా, లాక్ డౌన్ వంటి క్లిష్ట పరిస్థితులను అధిగమించి రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రికార్డుస్థాయి ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందన్నారు.

ఒకవైపు లక్ష్యానికి మించి ధాన్యం దిగుబడికావడం మరోవైపు కరోనా, లాక్ డౌన్, హమాలీలు, లారీలు, డ్రైవర్ల కొరత వీటికి తోడు డిమాండ్ కు అనుగుణంగా మిల్లింగ్ సామర్థ్యం లేకపోయినా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అధికార యంత్రాగం పనిచేసి రైతాంగానికి ఎలాంటి నష్టం లేకుండా పకడ్బందిగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. గత ఏడాది యాసంగిలో కంటే 20 లక్షల మెట్రిక్ టన్నులు అధికంగా కొనుగోలు చేశాం. ఇప్పటి వరకు 12.50 లక్షల మంది రైతుల నుంచి 6,962 కొనుగోలు కేంద్రాల ద్వారా 82 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడం జరిగింది. దీని విలువ దాదాపు రూ. 16 వేల కోట్లు ఉంటుంది. 78 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు తరలించండం జరిగింది.

నల్గొండ, నిజామాబాద్, సూర్యాపేట, కామారెడ్డి కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ (రూరల్), మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, నారాయణ పేట, భూపాలపల్లి, గద్వాల్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, జగిత్యాల 19 జిల్లాల్లో లక్ష్యానికి మించి ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ఇంకా 3 నుండి 4 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు.

వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వీలైనంత తర్వగా కొనుగోళ్ల ప్రక్రియను ముగించాలని, అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు త్వరితగతిన ఆన్ లైన్ లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

జూన్ నెలకు సంబందించి ఇప్పటి వరకు 8 లక్షల మందికి 40 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది.

More Press Releases