కరోనా ఎఫెక్ట్: తెలంగాణలోని జూ పార్కులు మూసివేత.. వెల్లడించిన మంత్రి!

Related image

హైదరాబాద్: కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో జూ పార్క్ లు, పులుల అభయారణ్యంలు, జాతీయ ఉద్యాన వనాలను మూసివేయనున్నట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు స్పందించి అటవీ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

మంత్రి సూచనల మేరకు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్, వరంగల్ కాకతీయ జూ పార్క్ లను మూసివేశారు. అలాగే అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ లు, రక్షిత అటవీ ప్రాంతాల మూసివేయనున్నట్లు అటవీ శాఖ తెలిపింది. వీటిల్లో సందర్శకులకు అనుమతి నిలిపివేతకు నిర్ణయం, హైదరాబాద్ కేబీఆర్ (KBR) పార్క్ ను కూడా కోవిడ్ నిబంధనల ప్రకారం మూసివేయనున్నట్లు పీసీసీఎఫ్ తెలిపారు.

More Press Releases