ప్రపంచంలోనే మొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాంసాగర్: సభాపతి పోచారం

22-04-2021 Thu 21:20

కామారెడ్డి జిల్లా: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ నుండి విడుదల చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాలు హల్ధీ వాగు ద్వారా మంజీర నదిలో ప్రవహించి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరిన సందర్భంగా నాగిరెడ్డిపేట మండలం వెంకంపల్లి గ్రామ సమీపంలో మంజీర నది వద్ద గోదావరి నీటికి పూజలు నిర్వహించిన రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర రోడ్లు & భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బిబీ పాటిల్, ఎల్లారెడ్డి, జుక్కల్ శాసనసభ్యుడు జాజుల సురేందర్, హన్మంత్ షిండే, కామారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ధఫేదార్ శోభ రాజు‌, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎ. శరత్, ఇరిగేషన్ సీఈ మధుసూదన్ రావు, ప్రజాప్రతినిధులు, అధికారులు.

సభాపతి పోచారం కామెంట్స్:

 • భగీరథుడు "దివి నుంచి భువికి" గంగను తీసుకువస్తే నేడు అపర భగీరథుడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు గోదావరి నదిని "భువి నుండి దివికి" తీసుకువచ్చాడని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు.
 • గోదావరి నీళ్ళను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తు నుంచి 600 మీటర్ల ఎత్తుకు అంటే అర కిలోమీటర్ ఎత్తిపోసి బీడు భూములకు నీరందిస్తున్నారని అన్నారు.
 • ఏడాది మొత్తం నిజాంసాగర్ నిండు కుండలా ఉండాలనే నలబై ఏళ్ళ నా కల ఈరోజు నెరవేరింది. కరోనా భయం ఉన్నా నెరవేరిన నా కలను కళ్ళారా చూసుకుందామనే ఈరోజు ఇక్కడికి వచ్చాను.
 • గోదావరి జలాలు మంజీరా నది ద్వారా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరిన ఈరోజు నిజంగా చారిత్రాత్మకం.
 • లక్షలాది రైతుల సాగునీటి కష్టాలకు ముగింపు పలికిన సందర్భం.
 • నది నీళ్ళు ఉప నదిలోకి ప్రవహించడం అంటే బిడ్డ దగ్గరకు తల్లి చేరడం వంటిది.
 • ఇంత గొప్ప విజయం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి వలనే సాధ్యం అయింది.
 • ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతుల తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు.
 • ప్రపంచంలోనే మొదటి భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాంసాగర్.
 • 2.70 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిజాం హయాంలో 1932లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుంది.
 • కానీ మంజీర నది ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు, ఎగువ రాష్ట్రాల అక్రమ ప్రాజెక్టుల నిర్మాణంతో నిజాంసాగర్ ప్రాజెక్టు ముపై ఏళ్లుగా గత ప్రాభవాన్ని కోల్పోయింది. 
 • ఉమ్మడి రాష్ట్రంలో మా నీట గోసలకు అంతులేదు.
 • ఎండుతున్న పంటలను కాపాడుకోవడానికి సింగూరు ప్రాజెక్టు నుంచి అర టీఎంసీ నీటి కోసం నాడు ముఖ్యమంత్రుల వద్ద బిక్షం ఎత్తుకునే పరిస్థితి ఉండేది. 
 • నీళ్లు లేక కళ్ళ ముందే పంటలు ఎండుతుంటే రైతులతో పాటుగా బాధపడుతూ కూచున్నాం.
 • కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతో ఏనాడూ పంటలు ఎండలేదు. 
 • రైతుల బాధలను అర్థం చేసుకుని ఉన్న కొన్ని నీటిలో నుండి కూడా రైతులకు నీటిని విడుదల చేశారు.
 • ఇక నుంచి ఆ ఇబ్బందులు ఉండవు.
 • ఆయకట్టు లోని రైతులకు ఏటా రెండు పంటలకు డోకా లేదు. వానల కోసం ఆకాశం వైపు, నీళ్ళ ప్రవాహం కోసం ఎగువ మంజీర నది వైపు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. 
 • రైతులు దైర్యంగా ఇగ రోహిణి కార్తెలోనే నార్లు పోసుకోవచ్చు. 
 • నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుతో పాటుగా త్వరలోనే నిర్మాణం చేసుకోనున్న నాగమడుగు ఎత్తిపోతల పథకం ద్వారా జుక్కల్ నియోజకవర్గ పరిధిలో మరో నలబై వేల ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. 
 • మంజీర నదిలో నిత్యం నీళ్లు ప్రవహిస్తాయి కావున నదిపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలు, మోటార్ల ద్వారా సాగు చేసుకుంటున్న రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతుంది.
 • కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణతో పాటుగా నూతనంగా మరో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
 • ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండటం వలనే ఇంత గొప్ప మార్పు జరిగింది. మరెవరూ ఇంత సాహసం చేయలేరు. తమ కష్టాలను దూరం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రైతులు కొలుస్తారు. 
 • రాష్ట్రంలో సుమారు కోటి యాబై లక్షల ఎకరాలు సాగు భూమి ఉన్నది. 
 • రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రైతులు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనే ప్రాజెక్టుల ద్వారా సాగునీరు, ఉచితంగా 24 గంటల కరంటు, పెట్టుబడి కోసం రైతుబంధు అందిస్తున్నారు.
 • పుష్కలంగా నీళ్లు ఉన్నందున రైతులు తమ పంటలను సమయానుకూలంగా వేసుకోవాలి. 
 • వానాకాలం రోహిణి కార్తెలోనే నార్లు పోసుకోవాలి. 
 • ఎప్రిల్ నెలలో వచ్చే వడగళ్ల వానలను తప్పించుకోవాలంటే అక్టోబర్ నెలలోనే యాసంగి నాట్లు వేయాలి.
మంత్రి ప్రశాంత్ రెడ్డి కామెంట్స్:
 • కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే అద్భుతం. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషితోనే ఇంత గొప్ప ప్రాజెక్టు నిర్మాణం సాద్యమైంది.
 • కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు గోదావరి జలాలను తీసురావడంలో స్పీకర్ పోచారం గారి కృషి గొప్పది. ముఖ్యమంత్రి గారిని పట్టుదలగా ఒప్పించి నీటిని తెప్పించారు.
 • ఇప్పటికే గోదావరి జలాలతో నడీ ఎండాకాలంలో కూడా వాగులు, వంకలు, చెక్ డ్యాంలు, చెరువులు మత్తడులు దూకుతున్నాయి. 
 • కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ద్వారా హల్ధీ వాగులోకి గోదావరి జలాలను విడుదల చేసి నిజాంసాగర్ ప్రాజెక్టును నింపుతున్నందుకు ముఖ్యమంత్రి గారికి పాదాభివందనం.


More Press Releases
యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఆసుపత్రి నిర్మాణం: మంత్రి జగదీష్ రెడ్డి
1 hour ago
కోవిడ్ నియంత్రణకు సంబంధించి సీఎం ఆదేశాల ప్రకారం వెంటనే తగు చర్యలను ప్రారంభించాలి: మంత్రి హరీష్ రావు
1 hour ago
DST institute develops new multiplex RT-PCR kit with novel gene targets to facilitate detection across various mutant strains of COVID 19
1 hour ago
GQ India’s May 2021 issue: Justin Bieber - Amazing Grace
2 hours ago
KRAFTON announces pre-registrations for BATTLEGROUNDS MOBILE INDIA
3 hours ago
PM Interacts with State and District Officials on the COVID-19 situation
4 hours ago
Daily Recoveries more than 4 Lakh in the country, for the first time
5 hours ago
Railways set to have 86 Oxygen plants for its hospitals
5 hours ago
PM to interact with State and District officials across the country on COVID-19 management
22 hours ago
Governor Tamilisai calls for continued research in plasma therapy for COVID patients
23 hours ago
వ్యాక్సిన్ కేంద్రప్రభుత్వ పరిధిలోనిది: మంత్రి జగదీష్ రెడ్డి
1 day ago
We must all strive for the Healthy Telangana: Governor
1 day ago
Reliance Supports Covid-19 Initiatives in Telangana and Andhra Pradesh
1 day ago
HCL expands investment in the United Kingdom
1 day ago
India at the Center of Two New Subsea Cable Systems to Support Exponential Data Growth
1 day ago
TVS Srichakra enters Europe Two-Wheeler Tyre market with exclusive product range under Eurogrip brand
1 day ago
పలు శాఖల సమన్వయంతోనే కరోనా కట్టడి: మంత్రులు తలసాని, మహ్మూద్ అలీ
1 day ago
Swift actions taken by Government to enhance availability of Remdesivir in India
1 day ago
Defence Minister Rajnathsingh unveils first batch of anti-COVID drug developed by DRDO
1 day ago
pTron Launches Tangent Plus v2 - BT Neckband with Super Quick Charging
1 day ago
Aakash Educational Services Limited launches NCERT Crash Course for Class 9 and 10 students
1 day ago
IAF preparation for cyclone Tauktae continues
1 day ago
Spark OTT Live in Few Hours, Promises To Revolutionise The OTT Space
4 days ago
Garudavega Ships Oxygen Concentrators to India
5 days ago
Telangana gets nod for experimental drone flights for vaccine delivery
1 week ago
Advertisement
Video News
Venkatesh calls for self care from covid
అందరం దేశానికి సేవ చేసే టైమొచ్చింది: వెంకటేశ్
18 minutes ago
Advertisement 36
Telangana corona details bulletin
తెలంగాణలో కొత్తగా 3,982 మందికి కరోనా పాజిటివ్
27 minutes ago
Sajjala comments on Raghurama Krishna Raju
ఓ పక్క మీసం మెలేస్తారు... మరో పక్క అరికాలు ఎత్తి చూపిస్తారు: రఘురామపై సజ్జల వ్యాఖ్యలు
45 minutes ago
Kruthi Shetty gave a clarity on her new movies
కొత్త ప్రాజెక్టులపై క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి!
1 hour ago
Chiranjeevi birthday special initiative
చిరంజీవి పుట్టినరోజు నేపథ్యంలో యోగా కార్యక్రమాలకు ప్రోత్సాహం
1 hour ago
Huge budjet for Pushpa movie
'పుష్ప' రెండు భాగాల మొత్తం ఖర్చు 250 కోట్లు?
1 hour ago
Woman constable from Hyderabad deceiving men with honey trap
ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటున్న హైదరాబాద్ మహిళా కానిస్టేబుల్
1 hour ago
Covid surge continues in Andhra Pradesh
ఏపీలో కొనసాగుతున్న కొవిడ్ కల్లోలం
1 hour ago
Vijayasai Reddy fires on Chandrababu
మోదీ ప్రశంసిస్తుంటే.. పచ్చ పార్టీ నేతలు గొడవ చేస్తున్నారు: విజయసాయిరెడ్డి
1 hour ago
Centre says recovery rate increased in country
దేశంలో రికవరీ రేటు పెరిగింది: కేంద్రం వెల్లడి
1 hour ago
Ntr fans has focus on his birthday
ఎన్టీఆర్ బర్త్ డే రోజున కొత్త సినిమా టైటిల్ ప్రకటన?
2 hours ago
Delhi court denies wrestler Sushil Kumar anticipatory bail
ఢిల్లీ కోర్టులో రెజ్లర్ సుశీల్ కుమార్ కు చుక్కెదురు... ముందస్తు బెయిల్ నిరాకరణ
2 hours ago
Kangana Ranaut Says She Tested Negative For
కరోనా నుంచి కోలుకున్న కంగనా రనౌత్
2 hours ago
Team India crickters will get their corona vaccine second dose in England
టీమిండియా క్రికెటర్లకు ఇంగ్లండ్ లో రెండో డోసు టీకాలు
2 hours ago
Update on Raviteja Khiladi
'ఖిలాడి' షూటింగు అప్ డేట్!
2 hours ago
Stop all flights from Singapore demands Kejriwal
సింగపూర్ లో కొత్త కరోనా వేరియంట్.. అక్కడి నుంచి వచ్చే అన్ని విమానాలను ఆపేయండి: కేజ్రీవాల్
2 hours ago
NHRC responds to Tirupati RUIA hospital incident
తిరుపతి రుయా ఘటనపై స్పందించిన ఎన్ హెచ్ఆర్ సీ
2 hours ago
 Congress MLA Jaggareddy says thanks to CM KCR
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు: కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
3 hours ago
Renu Desai fires in netizens
సరదా సందేశాల కారణంగా కొందరి ప్రాణాలు పోతున్నాయి: నెటిజన్లపై రేణు దేశాయ్ ఆగ్రహం
3 hours ago
Army offices not allowed Raghu Rajus family to see him
నాన్నను ఆర్మీ అధికారులు కలవనీయలేదు: రఘురాజు కుమారుడు
3 hours ago