పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కోవిడ్ టీకా

Related image

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం పంచాయతీరాజ్ శాఖ పరిధిలో పని చేస్తున్న ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్లందరికి కోవిడ్ టీకా వేయంచడానికి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు జారీ చేసినట్లు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లు, ZPTC లు, మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు, వార్డ్ సభ్యులతో పాటు పంచాయతీరాజ్, NREGS, SERP ఉద్యోగులకు రాబోయే నాలుగు రోజులలో కోవిడ్ టీకా వేయించాలని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 65,108 మందిని టీకా వేయడానికి గుర్తించగా, ఇప్పటి వరకు 21,849  మందికి టీకాలు వేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి ఈ నెల 14వ తేదీ వరకు వేయించాలని ఆయన స్పష్టం చేశారు. మండల స్థాయిలో ఎంపిడిఓ నోడల్ అధికారిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించాలి. జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల అదనపు జిల్లా కలెక్టర్లు, జడ్.పి. CEO లు, DRDO, DPO లు బాధ్యత తీసుకోవాలన్నారు.

బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమీషనర్ రఘునందన్ రావు, ఆరోగ్య శాఖ డైరెక్టర్ డా.జి.శ్రీనివాస్ రావు, జిల్లాల నుండి అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫిసర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారులకు, MPDO లు, MPO లు పాల్గొన్నారు.  

More Press Releases