27న జ‌గ‌న్మాత దుర్గ‌మ్మ‌కు వెలంప‌ల్లి అశ్విత‌ ముత్యాల‌హారం స‌మ‌ర్ప‌ణ

Related image

  • రూ 20 ల‌క్ష‌లతో వెలంపల్లి ట్రస్ట్ విరాళంతో నిర్మించిన పిండ‌ప్ర‌ధానం రేకుల షెడ్డు ప్రారంభోత్స‌వం
విజయవాడ క‌న‌క‌దుర్గ‌మ్మవారి ఆశీర్వాద దీవెనలు వుంటే కోరినవారికి కొంగు బంగారం ఇచ్చే కరుణ కలిగిన చల్లని తల్లి ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత కనకదుర్గమ్మ అని నమ్మి నిత్యం అమ్మవారిని కొలిచే భక్తుడు దేవ‌దాయ ద‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు.

మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు కుమార్తె వెలంప‌ల్లి అశ్విత జ‌న్మ‌దినం సంద‌ర్భంగా జ‌గన్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు అలంక‌రించేందుకు ప్ర‌త్యేకంగా త‌యారు చేయించిన 260 గ్రామ‌ల బంగారం కూడిన 6 లైన్లుగ‌ల 16 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ గ‌ల‌ ముత్యాల హారంను 27వ తేదీ శనివారం సాయంత్రం 4 గంట‌ల‌కు కానుక‌గా సమర్పిస్తారని మంత్రి కార్యాల‌యం నుంచి విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

అనంతరం సాయంత్రం 5 గంట‌ల‌కు దుర్గ‌ఘాట్ వ‌ద్ద 3500 అడుగ‌ల విస్తీర్ణంలో వెలంపల్లి మహాలక్ష్మమ్మ, అవినీష్ చారిటబుల్ ట్రస్ట్ 20 ల‌క్ష‌ల రూపాయ‌లతో నిర్మించిన‌ పిండ‌ప్ర‌ధానం రేకుల షెడ్డును వెలంప‌ల్లి అశ్విత ప్రారంభించిన‌ అనంత‌రం 100 మంది బ్ర‌హ్మ‌ణుల‌కు వస్త్రాలను బహుకరిస్తారు.

More Press Releases