తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ సెక్రటరి

Related image

హైదరాబాద్: ప్రధాన మంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి, అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ మరియు అర్బన్ ట్రాన్స్ ఫార్మేషన్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నందుకు కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ సెక్రటరి దుర్గా శంకర్ మిశ్రా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.

అమృత్, స్మార్ట్ సిటీ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్, పీఎం స్వనిధి, Housing for All లాంటి పథకాల పురోగతిపై కేంద్ర కార్యదర్శి బి.ఆర్.కె.ఆర్ భవన్ లో నేడు సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం National Urban Livelihood Mission అమలులో సాధించిన పురోగతిని కూడా గుర్తించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న Urban Schemes పై సీనియర్ మున్సిపల్ అధికారులు detailed presentation చేశారు.

సమావేశం అనంతరం కేంద్ర కార్యదర్శి లక్డికాపుల్ నుండి ఎల్బీనగర్ వరకు మెట్రోలో ప్రయాణించడంతో పాటు, ఫతుల్లాగూడలోని జంతు సంరక్షణ కేంద్రం, వనస్థలిపురంలో డబుల్ బెడ్ రూం ఇండ్లను సందర్శించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రహదారులు, భవనాల మరియు హౌసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, కేంద్ర జాయింట్ సెక్రటరి సంజయ్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, జీహెచ్ఎంసీ అదనపు కమీషనర్, యుసిడి, శంకరయ్య, HMRL, MD ఎన్.వి.ఎస్ రెడ్డి, మున్సిపల్ పరిపాలన కమీషనర్ మరియు డైరెక్టర్ సత్యనారాయణ, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ పమేలా సత్పతి, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ వల్లురి క్రాంతి, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ (పిహెచ్) శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases