హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ గుర్తింపు
18-02-2021 Thu 18:40

- ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా హైదరాబాద్ నగరం
- హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్
ప్రపంచంలోని 63 దేశాల నుండి 120 నగరాలు ఎఫ్.ఏ.ఓ, ఆర్బర్ డే ఫౌండేషన్ పరిగణలోకి తీసుకోగా వీటిలో 2020 సంవత్సరానికి గాను 51 నగరాలను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన నగరాలు ఈ జాబితాలో ఉండగా భారతదేశం నుండి ఏకైక నగరం హైదరాబాద్ ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తింపు పొందింది.
కాగా, రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా కోట్లాది మొక్కలను జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖలు నాటడంతో పాటు వాటి మనుగడకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. హరిత భవిష్యత్ కు గాను మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకై ఐదు ప్రధాన లక్ష్యాలను మున్సిపల్ శాఖ చేపట్టింది. మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించడం, మొక్కల నిర్వహణకు ప్రత్యేక నిబంధనల ఏర్పాటు, మొక్కల ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రత్యేక నిధుల కేటాయింపు, చెట్ల పెంపకంపై చైతన్యం పెంచే ఉత్సవాల నిర్వహణ అనే లక్ష్యాలతో హైదరాబాద్ నగరంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు.
గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్, కార్యాలయాలు, విశ్వవిద్యలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం ప్లాంటేషన్ వివరాలను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ -2020 గుర్తింపుకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం హైదరాబాద్ నగరానికి ఈ గుర్తింపునిస్తూ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు ప్రకటించాయి.
హైదరాబాద్ నగరం అర్బన్, కమ్యునిటీ ఫారెస్ట్రిలో ఆదర్శవంతమైన నగరంగా ప్రపంచంలోనే పలు నగరాలకు మార్గదర్శకంగా నిలిచింది. గతంలోకన్నా పెద్ద సంఖ్యలో మొక్కలు, అడవులను పెంచడం ద్వారా హైదరాబాద్ నగరం మరింత ఆరోగ్యకరమైన, నివాసయోగ్యమైన నగరంగా రూపొందడం అభినందనీయమని అర్బర్ డే ఫౌండేషన్ అధ్యక్షుడు డాన్ లాంబే తన సందేశంలో పేర్కొన్నారు. 2021 మార్చి 1వ తేదిన గాని అంతకు ముందేగాని హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ప్రకటించనున్నామని డాన్ లాంబే రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరం ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తింపు పొందడం పట్ల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు హర్షం వ్యక్తం చేశారు. హరితహారంలో భాగంగా చేపట్టిన ప్లాంటేషన్ కు ఇది లభించిన గుర్తింపు అని తన ట్విట్టర్ లో కేటీఆర్ పేర్కొన్నారు.
కాగా, హరితహారంలో భాగంగా కేవలం ఒక జీహెచ్ఎంసీ ద్వారానే గ్రేటర్ హైదరాబాద్ లో పచ్చదనాన్ని పెంపొందించడం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు, ఉష్ణోగ్రతలు, పొల్యూషన్ తగ్గింపుకై చేపట్టిన ఇప్పటి వరకు 2,76,97,967 మొక్కలను నాటడం, పంపిణీ చేయడం జరిగింది. 2016 నుండి 2020 వరకు 3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 86.28 శాతం మొక్కలు పంపిణీ, నాటడం జరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రెండున్నర కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 2.08 కోట్ల మొక్కలను పంపిణీ, నాటడం జరిగింది.
నగరంలోని 65 ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ మియావాకి ప్లాంటేషన్ ను చేపట్టారు. 19 మేజర్ పార్కులు, 17 థీమ్ పార్కులు, 919 కాలనీ పార్కులు, 105 సెంట్రల్ మీడియన్ లు, 66 ట్రాఫిక్ ఐ-లాండ్ లు, 18 ఫ్లైఓవర్లు, 327 ట్రీ ఫార్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
More Press Releases

Telangana Covid Vaccination update as on 06.03.2021
17 hours ago

‘Asian Paints Where The Heart Is’ Season 4 kicks-off with Music Maestro Shankar Mahadevan’s Sprawling Holiday Home
17 hours ago

Alia Bhatt’s new mantra in life is to ‘Take It Light’ with Cadbury Perk
21 hours ago

తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించిన కేంద్ర హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ సెక్రటరి
21 hours ago

Goddess Nayanatara appears on Star Maa this Sunday
1 day ago

India Science Research Fellowship (ISRF) 2021 announced
1 day ago

Telangana Covid Vaccination update as on 05.03.2021
1 day ago

శాంతి స్ధాపన కోసం రోటరీ ఇంటర్నేషనల్ కృషి అభినందనీయం: ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
1 day ago

Amrita School of Engineering Announces AlgoQueen Programming Contest for Girls
1 day ago

MG launches ‘‘WOMENTORSHIP’ to support social women entrepreneurs
1 day ago
PayPal India launches Unity Bloom with WSquare
1 day ago

Samantha Akkineni urges everyone to Upgrade to Clean Nutrition with OZiva
1 day ago

We need to ensure good nutritional status of tribal people: Governor Tamilisai
1 day ago

Finolex Cables strengthens its FMEG portfolio!
1 day ago

హస్తకళాకారుల ఉన్నతికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విభిన్న కార్యక్రమాల అమలు: లేపాక్షి నిర్వహణా సంచాలకులు లక్ష్మినాధ్
1 day ago

Paytm offers rewards up to Rs. 1000 on mobile recharges, launches referral scheme to get assured cashback of Rs. 100
1 day ago

తెలంగాణ సీఎస్ ను కలిసిన ఈస్తోనియా అంబాసిడర్
1 day ago

DRDO conducts successful flight test of Solid Fuel Ducted Ramjet
1 day ago

Present increase in platform ticket prices at some stations is a "Temporary" measure
1 day ago

KFC India launches all-women restaurant in Hyderabad
2 days ago

Union Minister Prakash Javdekar receives his first shot of COVID19 vaccine
2 days ago

PM pays tributes to Biju Patnaik on his birth anniversary
2 days ago

CM KCR visits Sri Lakshmi Narasimha Swamy Temple, Yadadri
2 days ago

ఈనెల 7న మొజమ్ జాహి మార్కెట్ ఆవరణలో “గుల్దస్తా” సంగీత కార్యక్రమం
2 days ago

Telangana Covid Vaccination update as on 04.03.2021
2 days ago
Advertisement
Video News

రెండో పెళ్లి అంటూ వస్తున్న కథనాలపై మంచు మనోజ్ స్పందన
2 minutes ago
Advertisement 36

తమిళనాడులో రూ.వెయ్యి కోట్లు సీజ్.. బంగారం వ్యాపారి ఇళ్లు, ఆఫీసులపై దాడులు
10 minutes ago

‘మోదీ దుకాణం’లో శానిటరీ ప్యాడ్ రెండున్నర రూపాయలే: ప్రధాని మోదీ
27 minutes ago

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ మనవడు ర్యాగింగ్ చేశాడని పోలీసులకు ఫిర్యాదు
40 minutes ago

ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుంది: మైకెల్ వాన్
50 minutes ago

బీజేపీలో చేరిన తృణమూల్ నేత, బెంగాలీ స్టార్ మిథున్ చక్రవర్తి
53 minutes ago

నిహారిక కాలికి గాయం.. ఫొటో పోస్ట్ చేసిన నాగబాబు కూతురు
1 hour ago

'ఎవరు మీలో కోటీశ్వరుడు'లో జూ.ఎన్టీఆర్.. ప్రోమోతో స్పష్టం చేసిన జెమినీ టీవీ
1 hour ago

155 మంది రోహింగ్యాలు జైలుకు
1 hour ago

కొండపై బంగారం దొరుకుతుండడంతో ఎగబడ్డ జనం.. వీడియో ఇదిగో
1 hour ago

పాక్ లో హిందూ కుటుంబం దారుణ హత్య
2 hours ago

బెంగాల్ మరో కశ్మీర్ అయితే తప్పేంటి?: ఒమర్ అబ్దుల్లా
2 hours ago

సొంత అక్క, అన్నను నరికి చంపిన తమ్ముడు
2 hours ago

ఒక్క పొర మాస్కులు కరోనాను కట్టడి చేయలేవు: పరిశోధకులు
2 hours ago

ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు సమస్యలు పట్టించుకోకుంటే వారి తలలు పగులగొట్టండి: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
2 hours ago

తెలంగాణలో కొత్తగా 158 కరోనా కేసులు
3 hours ago

రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ
3 hours ago

తమ పోలీసులు కాల్చిచంపిన భారతీయుడి మృతదేహాన్ని భారత్ కు అప్పగించిన నేపాల్!
3 hours ago

తెలంగాణలో భయపెడుతోన్న ఎండల తీవ్రత
4 hours ago

కోల్ కతాకు నరేంద్ర మోదీ, కేరళ, తమిళనాడుకు అమిత్ షా!
4 hours ago