రోట‌రీ న‌గ‌ర్‌ను సుందరంగా తీర్చిదిద్దుతాం: ఏపీ మంత్రి వెల్లంపల్లి

Related image

  • త‌క్ష‌ణ‌మే ర‌హ‌దారిపై మురుగునీరు తొల‌గించాల‌ని అదేశించిన మంత్రి
  • మోట‌ర్లు ద్వారా మురుగునీరు తొల‌గింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన అధికారులు
  • అర్హ‌లైన అంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు
విజయవాడ: రోట‌రీ న‌గ‌ర్, బృంద‌వ‌న్ కాల‌నీలోని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి సుందరంగా తీర్చిదిద్దుతామని దేవ‌దాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. శుక్ర‌వారం ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో అధికారుల‌తో క‌లిసి మంత్రి ప‌లు ప్రాంతాల‌ను ప‌ర్య‌టించారు. 45వ డివిజనులో రోటరీనగర్, బృంద‌వ‌న్ కాల‌నీ త‌దిత‌ర ప్రాంతాల‌ను ప‌ర్య‌టించిన మంత్రి స్థానికుల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. రాజ‌కీయ‌ల‌తో సంబంధం లేకుండా అర్హులైన అంద‌రికీ సంక్షేమ ప‌థకాలు అమ‌లు చేయ‌డం జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వ ల‌క్ష్యం అని అన్నారు.

రోట‌రీన‌గ‌ర్‌, బృంద‌న్‌ కాల‌నీ ఈ ప్రాంతంలో మురుగునీరు ర‌హ‌దారిపై రావ‌డం, పందులు సైర‌వీహ‌రం చేస్తున్నాయని ప్ర‌జ‌లు మంత్రికి స‌మ‌స్య‌ను వివ‌రించారు. దీంతో స్పందించిన మంత్రి త‌క్ష‌ణ‌మే మోటార్లు పెట్టి ము‌రుగునీరు తోడించాల‌ని ఆదేశించారు. అదే విధంగా ఇరిగేష‌న్ అధికారుల‌కు ఫోన్‌లో మ‌ట్లాడుతూ పైవోవ‌ర్ల దిగువ డైవ‌ర్ష‌న్ చాన‌ల్స్ సీల్ తోల‌గించాల‌ని ఆదేశించారు. ఈ ప్రాంతంలో నిరుప‌యోగంగా ఉన్న శిధిల‌మైన సోష‌ల్ వెల్ప్‌ర్ డిపార్టుమెంట్ ఎస్సీ హ‌స్ట‌ల్ పై నిర్ణ‌యం తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశించారు. అదే విధంగా ఈ ప్రాంతంలో హైటేన్ష‌న్ క‌రెంట్ వైర్లు ఉన్న కార‌ణంగా విద్యుత్ స‌మ‌స్య‌లు, ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని విద్యుత్ శాఖ అధికారుల‌కు ఆదేశించారు.

More Press Releases