అంద‌రికి సంక్షేమ ప‌థ‌కాలు అందించాల‌నేది ప్రభుత్వ ల‌క్ష్యం: ఏపీ మంత్రి వెల్లంపల్లి

Related image

  • చంద్ర‌బాబు నీచ‌రాజ‌కీయ‌ల‌కు పరాకాష్ట‌కు నిద‌ర్శనం 
  • ప్ర‌తిది రాజ‌కీయం చేయ‌డం, ప్ర‌భుత్వానికి ఆపాదించ‌డం చంద్ర‌బాబుకె చెల్లింది
  • రూ. 11ల‌క్ష‌ల 30వేల రిటైనింగ్ వాల్ నిర్మాణం
  • రూ. 15ల‌క్ష‌ల వాట‌ర్ ట్యాంక్ ఆధునిక‌ర‌ణ ప‌నులు
  • చిన్నారుల‌కు పల్స్‌ పోలియో చుక్కలు వేసిన మంత్రి
విజ‌య‌వాడ‌: అంద‌రికి సంక్షేమ ప‌థ‌కాలు అందించాల‌నే ల‌క్ష్యంతోనే జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం చిత్త శుద్దితో ప‌ని చేస్తుంద‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు అన్నారు.

బుధ‌వారం వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి మంత్రి పశ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలలో ప‌ర్య‌టించారు. తొలుత 52వ డివిజ‌న్ నెహు బొమ్మ సెంట‌ర్ వెణుగోపాల స్వామి గుడి పోతిన అప్ప‌న స్వామి వీధిలో ప‌ర్య‌టించారు. స్థానికుల‌ను స‌మ‌స్య‌లు అడుగుతూ వారినుంచి అర్జీల‌ను స్వీక‌రించారు. సాంకేతిక కార‌ణాల‌తో చాలా ‌మందికి ఫించ‌న్లు రాక‌పొవ‌డం, త‌దిత‌ర స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కొత్త‌పేట పోతిన అప్పలస్వామి వీధి కొండ ప్రాంతంలో 11ల‌క్ష‌ల 30వేల రూపాల‌య‌ల‌తో నిర్మించ‌నున్న రిటైనింగ్ వాల్ ను పరిశీలించారు. అడ్డ‌రోడ్డు స‌త్య‌నారాయ‌ణ మండ‌పం వ‌ద్ద సింహ‌ద్రి విధిలో మెట్లు నిర్మాణం పూర్తి చేయాల‌న్నారు. ఈ ప్రాంతంలో విద్యుత్ స‌మ‌స్య ప‌రిష్క‌రించి, నాణ్య‌మైన విద్యుత్ అందించే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, విద్యుత్  అధికారుల‌కు అదేశించారు. కొండ ప్రాంతంలో గాంధీబావి వ‌ద్ద 15ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో వాట‌ర్ ఆధునిక‌రించిన ప‌నుల‌ను మంత్రి ప‌రిశీలించారు. కొండ ప్రాంతంలో తాగునీరు కెపాసిటి పెంచాల‌ని, నిర్ణిత స‌మ‌యంలోనే తాగునీరు విడుద‌ల చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అడ్డ‌రోడ్డులో అమ్మ‌వారి గుడి వద్ద స్థానికులు మంత్రికి స్వాగ‌తం ప‌లికి, నిత్యం అందుబాటులో ఉండి స‌మ‌స్య‌లు ప‌రిష్కారించినందుకు మంత్రికి మ‌హిళాలు అభినంద‌న‌లు తెలిపారు. కొండ ప్రాంతం ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రంలో చిన్నారుల‌కు మంత్రి ప‌ల్స్ పొలియో చుక్కలు వేశారు.

More Press Releases