నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఏపీ దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి

Related image

  • స‌మ‌స్య‌ల త‌క్ష‌ణ ప‌రిష్కారానికే ప‌ర్య‌ట‌న‌
  • తాగునీటి స‌మ‌స్య‌పై దృష్టి సారించండి
  • కుమ్మ‌రిపాలెం సెంట‌ర్ క‌మ్యూనిటీ హల్లో కుట్టు మిష‌న్ కేంద్రం ఏర్పాటు చేయాలి
  • అధికారుల‌తో క‌లిసి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు
న‌గ‌రంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల త‌క్ష‌ణ ప‌రిష్కార వేదిక‌గా నియోజ‌క‌వ‌ర్గంలో అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌టిస్తున్న‌ట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు తెలిపారు. సొమ‌వారం 38 వ డివ‌జ‌న్  నాలుగు స్తంభాల సెంటరు నుంచి మంత్రి వెల్లంపల్లి, న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్రసన్న వెంకటేష్, సంబంధిత అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు.

తొలుత డివిజన్లలోని సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు ప్ర‌జ‌ల‌కు అందిస్తున్న సేవ‌ల‌పై ప్ర‌జ‌ల‌ను అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. వారి స‌మ‌స్య‌ల‌ను విన్నారు. నాలుగు స్థంబాల సెంట‌ర్ నుంచి కొండ ప్రాంతంపై వ‌ర‌కు మంత్రి న‌డుచుకుంటు వెళ్లారు. ఈ ప్రాంతంలో దెబ్బ‌తిన్న రోడ్డుకు మ‌ర‌మ్మ‌తులు చేయాల‌ని అధికారులు తెలిపారు. ఇళ్ళు ప‌ట్టాల పంపిణిపై ఉన్న ఇబ్బందుల‌ను ఫోన్‌లో క‌లెక్ట‌ర్‌తో మ‌ట్లాడి త‌ర్వ‌గా ప‌రిష్కారించాల‌న్నారు. స్థానికుల‌ను స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలో మొట్లు నిర్మాణం, మురుగు పారుద‌లకు కాల్వ‌ల నిర్మాణం పూర్తి చేయాల‌ని అధికారుల‌కు అదేశించారు. కుమ్మ‌రిపాలెం సెంట‌ర్ లో ఇటివ‌ల ఇళ్లు కూలిన ప్రాంతంను మంత్రి పరిశీలించారు. ఈ ప్రాంతంలో వీధి దీపాల మ‌రమ్మ‌తులు పూర్తి చేయాల‌ని విద్యుత్ అధికారుల‌కు తెలిపారు. కొండ ప్రాంతంలో తాగునీటి ఇబ్బంది లేకుండా పైపులైన్లు మ‌రమ్మ‌తులు పూర్తి చేయాలని, నిర్ణ‌యత స‌మ‌యంలో తాగునీరు అందే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.

అదే విధంగా కుమ్మ‌రి పాలెం సెంట‌ర్ కొటి రెడ్డి కోట‌య్యవీధిలోని క‌మ్యూనిటీ హోల్ నందు మ‌హిళల‌కు ఉపాధి నిమిత్తం కుట్టుమిష‌న్ కేంద్రం ఏర్పాటు చేయాల‌ని న‌గ‌ర పాల‌క సంస్థ అధికారుల‌కు అదేశించారు.

మ‌హిళాల‌కు చీర‌లు పంపిణి చేసిన మంత్రి వెల్లంపల్లి:
దిన‌వాహి స‌త్రం పౌండేష‌న్ డే సంద‌ర్బంగా పాత శివాల‌యం వ‌ద్ద‌ ఏర్పాటు చేసిన కార్యక్ర‌మంలో దేవ‌దాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీ‌నివాస‌రావు అతిధిగా పాల్గొన్ని మ‌హిళాల‌కు చీర‌లు పంపిణి  చేశారు. తొలుత స‌త్రం దాత‌లు దిన‌వాహి వెంక‌ట‌ప‌తి, అన‌సూయ దంప‌తుల‌కు చిత్ర‌ప‌టాల‌కు పూజా కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. అనంత‌రం మ‌హిళాల‌కు చీర‌లు పంపిణి చేశారు. దిన‌వాహి స‌త్రం దాత‌ల ఆశ‌య సాధ‌న‌కు కృషి చేయాలని మంత్రి పిలుపు నిచ్చారు.

More Press Releases