పద్మ శ్రీ గుస్సాడీ రాజు కనకరాజును అభినందించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్

Related image

  • పద్మ శ్రీ గుస్సాడీ రాజు కనకరాజు ను అభినందించిన రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో హైదరాబాద్ లోని రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో రాజ్ గోండు గిరిజనుల ప్రత్యేక నాట్య కళ గుస్సాడీలో అపార నైపుణ్యం గడించిన కుమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ రాజు కనకరాజు సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డు ప్రకటించిన అనంతరం మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివాసీ గుడేల్లో మాత్రమే కనిపించే గుస్సాడీ నృత్యం ఒక విశిష్టమైన కళ అని మంత్రి అభివర్ణించారు.

ఆదివాసీ నృత్యం గుస్సాడీ ని కొత్త తరానికి అందిస్తున్న కనకరాజు సేవలను గుర్తించి పద్మ శ్రీ పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాచీన నృత్యం పై మైదాన ప్రాంతాల్లో ని వారికి అవగాహన తక్కువ అన్నారు. వందల ఏళ్ల నుంచి ఈ ప్రాచీన దేవతా కళ తరతరాలు దాటుకుంటూ ప్రస్తుత రోబోటిక్ యుగంలోనూ కోనసాగుతోందన్నారు. గుస్సాడీ నాట్యానికి మెరుగులు దిద్దటమే కాకుండా నేటి తరానికి శిక్షణ ఇస్తూ మరింత గొప్ప కళ గా తీర్చిదిద్దుతున్న కనకరాజుని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా అభినందించి, ఘనంగా సన్మానించారు.

పద్మ శ్రీ పురస్కారం పొందిన కనకరాజు సేవలకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున 10 వేల రూపాయల  ప్రత్యేక పెన్షన్ ను అందించేందుకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తామన్నారు. కనకరాజు తో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన 12 మెట్ల కిన్నెర విద్వాంసులు, దర్శనం మొగిలయ్య కు త్వరలోనే అందిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంస్కృతిక సంచాలకులు మామిడి హరికృష్ణ, కనకరాజు బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

గుస్సాడి నృత్యానికి మరింత గుర్తింపు తెస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్:

గుస్సాడి నృత్యాన్ని భవిష్యత్ తరాలకు అందించే విధంగా కనకరాజు మార్గదర్శకత్వంలో దానికి మరింత వన్నె తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం తరపున కృషి చేస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అదేవిధంగా గుస్సాడి కనకరాజు కోరినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయనకు ఇళ్లు, భూమి, ట్రాక్టర్, బోర్ వెల్ ఇవ్వడంతో పాటు ఆయన కుటుంబంలో అర్హులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

గుస్సాడి నృత్యకారులు, ఆదివాసీ ఆత్మ గౌరవ పతాక గుస్సాడి కనకరాజును రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్ లోని డి.ఎస్.ఎస్ భవన్, గిరిజన మ్యూజియంలో నేడు ఘనంగా సన్మానించారు. ఆయనకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. గుస్సాడి రాజుతో సంక్షేమ భవన్ లో భోజనం చేసి ఆయనను గౌరవించారు.

అనంతరం పూలమాల వేసి, శాలువా కప్పి, గిరిజన సంప్రదాయం ప్రకారం బట్టలు పెట్టి సత్కరించారు. నృత్యానికి ఆదిగురువు అయిన నటరాజ ప్రతిమను ఇచ్చి సన్మానించారు.

మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్:

  • ఆదివాసీ బిడ్డ కష్టానికి, శ్రమకు గుర్తింపు ఇచ్చి పద్మశ్రీ అవార్డును ఇచ్చినందుకు గిరిజనులు, ఆదివాసీల తరపున కేంద్రానికి ధన్యవాదాలు.
  • కళలకు ప్రాణం పోయాలని, ఏదీ ఆశించకుండా గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శిస్తూ దానిని పదిమందికి నెర్పుతూ ఆ కళకోసమే బతికిన గుస్సాడి కనకరాజు కు పద్మశ్రీ రావడం నిజంగా ఇది ఆదివాసీలందరికీ లభించిన గొప్ప గౌరవం.
  • అంతరించి పోతున్న కళలను బతికిస్తున్న బారికి భారత ప్రభుత్వం గుర్తింపు ఇవ్వడం నిజంగా గొప్ప విషయం.
  • ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని కులాల కళలు, సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుకునేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగా గిరిజన తెగల సంప్రదాయాలు, ఆచారాలను ప్రతిబింబించే ఈ గిరిజన మ్యూజియంను కూడా ఆధునీకరించుకున్నాం. ఈ మ్యూజియంను చూస్తే అంతరించపోతున్న గిరిజన కళలు కళ్లకు కట్టినట్లు కనపడుతాయి. ఇక్కడే కాకుండా రాష్ట్రంలో మరో నాలుగుచోట్ల ఈ మ్యూజియాలు ఏర్పాటు చేసి కళలను కాపాడుతుంది.
  • గుస్సాడి నృత్యానికి 40 ఏళ్ల కిందే ఆదరణ లభించింది. మాజీ ప్రధాన స్వర్గియ ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గియ ఎన్టీరామారావు, మాజీ రాష్ట్రపతి స్వర్గియ అబ్దుల్ కలాం లు పిలిపించుకుని ఈ గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శింపజేయడం దీనికున్న ఆదరణకు నిదర్శనం.
  • గుస్సాడి కనకరాజుకు ఈ అవార్డు ఇవ్వడంతో గుస్సాడి నృత్యాన్ని ముందు తరాలకు అందించాల్సిన అవసరం ఉందని చెబుతోంది. మరింత శ్రద్ధతో గుస్సాడితో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న గిరిజన కళలన్నింటిని కాపాడేవిధంగా అవసరమైన బడ్జెట్ పెట్టి పరిరక్షించే ప్రయత్నం చేస్తాము.
  • గిరిజన ఉపకులాల సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను అదరికీ తెలిసేలా, ఒకరికొకరు గౌరవించుకునేలా కృషి చేస్తాము.
  • గుస్సాడి కనకరాజుకు అవార్డు రావడం మా అందరికీ ఎంతో సంతోషం కలిగించింది. ఇది మా అందరికీ వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నాం.
  • గుస్సాడి నృత్యాన్ని తనతో ఆగకుండా దానిని అందరికీ తెలిసేలా కష్టపడడం, ఎంతోమందికి నేర్పడం వల్ల నేడు ఆయన కృషిని గుర్తించి పద్మశ్రీ వరించింది. ఆయన ఆశయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున కొనసాగిస్తాం.
  • ఇంత గొప్ప కళాకారుడు నేడు చాలా పేదరికంలో ఉన్నారు. ఎంతోమంది గొప్ప వ్యక్తుల వద్ద ప్రదర్శనలు ఇచ్చినా ఎవరి దగ్గరి నుంచి ఏమీ ఆశించలేదు. కాబట్టి మా బాధ్యతగా ఆయన ఉండడానికి మంచి ఇల్లు, వ్యవసాయం చేసుకునేందుకు 5 ఎకరాల భూమి, ఆ భూమిలో వ్యవసాయం చేసుకునేలా ఒక ట్రాక్టర్, బోర్ వెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఆయన కుటుంబంలో అర్హత కలిగిన వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాము. అన్ని విధాల ఆయన కుటుంబానికి అండగా నిలబడుతాం.
  • గుస్సాడి నృత్యాన్ని పెంపొందించేందుకు దానిని పదిమందికి నేర్పించేందుకు కనకరాజు అనుభవాన్ని వినియోగించుకుంటాము. కనకరాజుని స్పూర్తిగా తీసుకోవాలని అందరిని కోరుతున్నాను. పద్మశ్రీ కనకరాజును సన్మానించే అవకాశం రావడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను.

గుస్సాడి నృత్యాకారులు పద్మశ్రీ కనకరాజు మాటలు:

ఆదివాసీలు అందరూ సంతోషంగా ఉండాలన్నది నా కోరిక. . ఈరోజు నాకు వచ్చిన గౌరవం ఆదివాసీలందరికీ లభించిన గౌరవంగా భావిస్తాను. ఐఎఎస్ తుకారాం ఎంతో సాయం చేశారు. ఆయనే నన్ను ప్రోత్సహించారు. నన్ను గుర్తించి అనేక ప్రదర్శనలు ఇప్పించారు. నాతో అందరికీ శిక్షణ ఇప్పించారు

గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా కామెంట్స్:

కనకరాజుకు పద్మశ్రీ రావడం మనకు ఎంతో గౌరవం. కనకరాజు తన జీవితాంతం గుస్సాడి నృత్యానికి కేటాయించినందుకు గొప్ప గుర్తింపు లభించింది. నేడొక శుభదినం. ఆదివాసీలకు కేంద్రం కల్పించిన గౌరవానికి కృతజ్ణతలు. గుస్సాడి గోండు రాతను మేము ఇంకా ప్రమోట్ చేసేందుకు కృషి చేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో, కమిషనర్ క్రిస్టినా, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్, ఇతర అధికారులు సముజ్వల, విజయలక్ష్మీ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మైదాన ప్రాంత ఐటీడీఏ వెబ్ సైట్ ను ప్రారంభించిన మంత్రి సత్యవతి రాథోడ్:

మైదాన ప్రాంతాల్లోని గిరిజనులకు ప్రభుత్వం తరపున లభించే పథకాలు, అవకాశాలు, హక్కులు, రక్షణల సమస్త సమాచారంతో ఐటీడీఏ గురుకుల విద్యా సంస్థ రూపొందించిన మైదాన ప్రాంత ఐటీడీఏ వెబ్ సైట్ itdahyd.in ను రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ నేడు మసాబ్ ట్యాంక్ లోని మంత్రి పేషిలో ప్రారంభించారు. ఈ వెబ్ సైట్ ద్వారా మైదాన ప్రాంత గిరిజనులు నేరుగా తమకు కావల్సిన సమాచారాన్ని పొందవచ్చని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు తెలిసేలా, చేరువయ్యేలా వెబ్ సైట్ రూపొందించడం పట్ల మంత్రి శాఖ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్ పాల్గొన్నారు.

More Press Releases