పౌల్ట్రీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది: మంత్రి తలసాని

Related image

తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని, పౌల్ట్రీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, చేవెళ్ళ పార్లమెంటు సభ్యుడు రంజిత్ రెడ్డితో కలసి పౌల్ట్రి ఇండస్ట్రీ ప్రతినిధులు వివిధ సంస్థల నుండి వచ్చిన సైంటిస్టులు, ప్రొఫెసర్లు, పౌల్ట్రి రంగ నిపుణులు, పశువైద్య శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో బర్డ్ ఫ్లూపై ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల గురించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. సమావేశం అనంతరం పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి  శాఖల కార్యదర్శి అనితా రాజేంద్రతో కలసి మీడియా ప్రతినిధులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు.

ఈ సమావేశంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పౌల్ట్రి ఇండస్ట్రీ దేశంలోనే మూడో స్థానంలో ఉన్నదని, ఇతర రాష్ట్రాలు, దేశాలకు పౌల్ట్రీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. చికెన్, గుడ్లు తినడం వలన ఎటువంటి నష్టం జరగదని, మనకు ప్రోటీన్ లు లభిస్తాయని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో బర్డ్ ఫ్లూ సోకినట్లు సమాచారం అందిన వేంటనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 1300 రాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర, జిల్లా, క్షేత్ర స్థాయిలలో పశుసంవర్ధక,  ఆరోగ్య , అటవీ శాఖలతో పాటు సరిహద్దు జిల్లాల కలెక్టర్లతో సమన్వయంతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. నల్గొండ, వరంగల్, పెద్దపల్లి జిల్లాలలో కోళ్లు మృతి చెందినట్లు మీడియాలో వచ్చిన వార్తలకు ప్రభుత్వం వెంటనే స్పందించి 276 శ్యాంపిల్స్ ను సేకరించి పరీక్షలు చేయించగా, నెగెటీవ్ రీపోర్ట్ వచ్చినట్లు తెలిపారు.

అదే విధంగా గత మూడు రోజులలో 1000 శ్యాంపిల్స్ పరీక్షించగా నెగెటీవ్ వచ్చినట్లు తెలిపారు. క్షేత్ర స్థాయిలో చేపట్టిన చర్యలు, శ్యాంపిల్స్ సేకరణ, పరీక్షలపై ప్రజలలో విస్తృత స్తాయిలో ప్రచారం కల్పించి పౌల్ట్రి పరిశ్రమను కాపాడుటకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. కోవిడ్ -19 ప్రారంభంలో పౌల్ట్రి ఉత్పత్తులపై పడిన ప్రభావాన్ని నివారించుటకు చేపట్టిన చర్యలతో పౌల్ట్రి పరిశ్రమ కోలుకుందని తెలిపారు. రాష్ట్రానికి వచ్చే వలస పక్షుల సంఖ్య చాలా పరిమితం అని తెలిపారు.

ఈ అంశంపై నీటిపారుదల, అటవీ శాఖ అధికారులతో మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. బర్డ్ ఫ్లూ పై మీడియాలో వస్తున్న కథనాల వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటున్నాయని, ప్రభుత్వ పరంగా చేపట్టిన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించుటలో సహకరించాలని మిడియాకు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పౌల్ట్రి ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు ఉన్నదని పేర్కొన్నారు. గతంలో బర్డ్ ఫ్లూ వలన పౌల్ట్రి ఇండస్ట్రీ మాత్రమే నష్టపోయినట్లు తెలిపారు. మనుషులకు ఎక్కడ నష్టం జరగలేదని తెలిపారు. మన శరీరానికి తక్కువ ఖర్చుతో అధిక విలువలువున్న ప్రోటీన్ లను అందించే శక్తి చికెన్, గుడ్లకు మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. పౌల్ట్రి ఇండస్ట్రీని కాపాడుటకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఉడికించిన చికెన్, గుడ్లతో నష్టం లేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ఈ సమావేశంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల కార్యదర్శి అనితా రాజేంద్ర, వైద్య ఆరోగ్య కార్యదర్శి రిజ్వీ, కుటుంబ సంక్షేమ కమీషనర్ వాకాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా.శ్రీనివాస్ రావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డా.వి.లక్ష్మారెడ్డి, డా.రాంచందర్, అడిషనల్ డైరెక్టర్ వి.హర్ష వర్ధన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్, బ్రీడర్స్ అసోసియేషన్, జి.రమేష్ బాబు, జనరల్ సెక్రటరీ, బ్రీడర్స్ అసోసియేషన్, కె.జి.ఆనంద్, CEO, నెక్ (NECC), కె.మోహన్ రెడ్డి,  పౌల్ట్రి ఫెడరేషన్. G.S.వి.బాస్కర్ రావు, పౌల్ట్రి ఫెడరేషన్, జి.చంద్ర శేఖర్ రెడ్డి,  చైర్మన్, NECC హైదరాబాద్, ఎ.గోపాల్ రెడ్డి, స్నేహ చికెన్, డి.రాఘవ రావు, బ్రీడర్స్ అసోసియేషన్, తదితరులు పాల్గొన్నారు. 
26 వ తేదీ నుండి మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమం: 
ఈ నెల 26 వ తేదీ నుండి రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన మత్స్యకారుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్య శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ముదిరాజ్, గంగపుత్రులు, తెనుగు, గుండ్ల బెస్త, బెస్త, ముతరాసి తెగలకు చెంది 18 సంవత్సరాల వయసు దాటిన వారిని అర్హులుగా గుర్తించి సభ్యత్వం కల్పించాలని చెప్పారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల లబ్ది అర్హులందరికీ అందాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని చెప్పారు. కోట్లాది రూపాయలను ఖర్చు చేసి ఉచితంగా చేప పిల్లలు, రొయ్య పిల్లలను పంపిణీ చేయడంతో పాటు మత్స్యకారులకు సబ్సిడీపై వివిధ రకాల వాహనాలను అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు.  

ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులందరికీ అందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఇందుకోసం విధివిధానాలను సిద్దం చేయాలని కమిషనర్ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు. సభ్యత్వం పొందిన వారికి ప్రభుత్వ పంపిణీ చేసే చేపలు పట్టుకోవడానికి, చెరువులపై హక్కులు కల్పించడం జరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు పూర్తయిన అనంతరం మత్స్య సహకార సొసైటీలకు ఎన్నికలను నిర్వహిస్తామని తెలిపారు.

అదే విధంగా పిబ్రవరి మొదటి వారంలో 150 సంచార చేపల విక్రయ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. 6లక్షల రూపాయలు ప్రభుత్వ సబ్సిడీ కాగా, 4 లక్షల రూపాయలను లబ్దిదారుల వాటాగా చెల్లించేలా ఈ పథకాన్ని రూపొందించడం జరిగిందని వివరించారు. 3 నుండి 5 మంది మహిళలతో కూడిన టీంకు ఒక వాహనాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

మత్స్యకార మహిళలు ఈ వాహనం ద్వారా చేపలు, చేప వంటకాలను విక్రయించుకోవడం ద్వారా స్వయం ఉపాది పొందుతారని వివరించారు. ఈ వాహనాలను GHMC తో పాటు రాష్ట్రంలోని ఒక్కో జిల్లాలో 3 చొప్పున ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

More Press Releases