తెలంగాణలో తోలిసారిగా ఎయిర్ స్పోర్ట్స్ జాతీయ స్థాయి చాంపియన్ షిప్

Related image

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో తోలిసారిగా పారా మోటరింగ్, స్కైడ్రైవింగ్, హాట్ ఎయిర్ బేలూన్స్ మరియు ఆర్ సి డ్రోన్స్ లాంటి ఎయిర్ స్పోర్ట్స్ జాతీయ స్థాయి చాంపియన్ షిప్ ను మహబూబ్ నగర్ పట్టణం వేదికగా నిర్వహించటం ఎంతో సంతోషంగా వుందన్నారు రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.

హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన పత్రికా సమావేశంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ వెంకటరావుతో కలసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలో పర్యాటక శాఖ ద్వారా ఎన్నో విన్నూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. గతంలో ఈలాంటి పారా మోటరింగ్ ఎయిర్ స్పోర్ట్స్ మోట్రోపాలిటన్ నగరాలకు మాత్రమే పరిమితం అయ్యేవన్నారు.తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆవతరణ ధినోత్సవం, బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఎయిర్ స్పోర్ట్స్ ను నిర్వహించామన్నారు. ఈ పర్యాయం జాతీయ స్థాయిలో ఎయిర్ స్పోర్ట్స్ ను నిర్వహించటం రాష్ట్రంలో ఇదే తొలిసారని మంత్రి వెల్లడించారు. పారా మోటరింగ్ స్పోర్ట్స్ కు మహబూబ్ నగర్ పట్టణం ఎంతో అనుకూలంగా ఉందన్నారు.

ఈ ఎయిర్ స్పోర్ట్స్ ను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 నుండి 17 వరకు సుమారు 5 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఎయిర్ స్పోర్ట్స్ లో దేశంలోని ప్రముఖ పారా మోటర్ గ్లైండర్ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. ఈ ఎయిర్ స్పోర్ట్స్ లో థాయ్ లాండ్ లో నిర్వహించిన ఇంటర్ నేషనల్ పారా మోటరింగ్ చాంపియన్ షిప్ లో పాల్గొని కాంస్య పతకం సాధించిన టీం సభ్యలు పాల్గోంటున్నారన్నారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా వలసలకు పెట్టింది పేరుగా గత ప్రభుత్వాలు నిలిపాయి. నేడు శరవేగంగా మహబూబ్ నగర్ పట్టణము అభివృద్ది పథంలో దూసుకపోతున్న నేపథ్యంలో ఇలాంటి ఎయిర్ షోలు జరగటం వల్ల గ్రామీణ స్థాయి యువతకు కొత్త అనుభూతిని కల్గిస్తుందన్నారు.

ఈ ఎయిర్ స్పోర్ట్స్ లోఉమ్మడి మహబుబ్ నగర్ జిల్లాతో పాటు హైదరాబాద్ మరియు వివిధ రాష్ట్రాల, వివిధ ప్రాంతాలలోని యువత ఈఎయిర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ గేమ్స్ చూడటానికి పెద్ద ఏత్తున తరలిరానున్నారు. అందుకు టూరిజం శాఖ, జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ ఎయిర్ స్పోర్ట్స్ ను పూర్తి శిక్షణ పోందిన నిపుణులచే టేకాఫ్ మరియు సెల్ప్ ల్యాండింగ్ లాంటివి నిర్వహిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ సాహసోపేతమైన ఆటలు యువతకు మంచి అనుభూతిని ఇస్తాయన్నారు. ఈ పారా మోటరింగ్ లో పాల్గొనడం ద్వారా సాధారణ విపత్తులు మరియు వైద్య విపత్తుల్లో ఎలా స్పందిస్తారో వాళ్ళ కష్టాలేమిటో స్వయంగా తెలుసుకోవచ్చుని వెల్లడించారు. ఈ ఎయిర్ స్పోర్ట్స్ లో విజయం సాధించిన మెదటి మరియు రెండవ స్థానం సాధించిన వారు భవిష్యత్ లో నిర్వహించే అంతర్జాతీయ పారా మోటరింగ్ చాంఫియన్ షిప్ లో పాల్గొనే అవకాశం ఉందన్నారు.

ఈ ఎయిర్ స్పోర్ట్స్ లో సాధారణ ప్రజలు 10 నిమిషాల పారా మోటరింగ్ అక్టివిటిలో పాల్గోనేందుకు 1500 రూపాయల కనీస చార్జీని నిర్ణయించామన్నారు. వీటితో పాటు హాట్ బెలూన్ జాయ్ రైడ్ లో పాల్గోనే వారికి 500 రూపాయల చార్జీని నిర్ణయించటం జరిగింది. ప్రజలందరూ ఇలాంటి ఎయిర్ స్పోర్ట్స్ ను మద్దతు తెలిపి స్వచ్చందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా ప్రజలు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ కల్పిస్తున్న గొప్ప అవకాశంను ప్రజలందరూ వినియోగించుకొని సంతోషంగా ఉండాలని ఈ ఎయిర్ స్పోర్ట్స్ ను నిర్వహిస్తున్నాము.  

మహబూబ్ నగర్ పట్టణమునకు కూతవేటు దూరంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం వల్ల భవిష్యత్ లో ఇంకా అభివృద్ది చేస్తున్నాము. పరిశ్రమల, ఐటి శాఖ మంత్రి కె టి రామారావు సారధ్యంలో పారిశ్రామికంగా జిల్లాకు ఐటి కంపనీలు, ఫార్మా కంపనీలు, భారీ పరిశ్రమలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టడానికి క్యూ కట్టుతున్నాయి. భవిష్యత్ లో మహబూబ్ నగర్ పట్టణంలో మరేన్నో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా వేదికలకు వేదిక అయ్యే అవకాశం వుందన్నారు. ఇప్పటికే క్రీడాకారుల ఉత్పిత్తి కేంద్రంగా, ఎన్నో క్రీడా అకాడమీలకు కేంద్రంగా ఉంది. రాష్ట్రంలో, దేశంలో మహబూబ్ నగర్ జిల్లా క్రీడాకారులు ఎంతో సత్తా చాటి రాష్ట్రం, దేశం పేరు ప్రఖ్యాతులు తీసుకవస్తున్నారని వెల్లడించారు.

ఈ కార్యక్రమములో వర్టికల్ వరల్డ్ అడ్వెంచర్ మరియు ఎయిర్ స్పోర్ట్స్ వ్వవస్థాపకులు సుకుమారు, జగదీష్ రెడ్డి, డా. వెంకట్ రావు లు పాల్గొన్నారు.

More Press Releases