గురువారం మరో 24 బస్తీ దవాఖానలను ప్రారంభించనున్న మంత్రులు, మేయర్

Related image

హైదరాబాద్, నవంబర్ 11: గ్రేటర్ పరిధిలోని నిరుపేదలకు మెరుగైన వైద్య పరీక్షలు అందించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఇప్పటికే 200 బస్తీ దవాఖానలను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. వీటికి తోడు మరో 24 బస్తీ దవాఖానలను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు గురువారం నాడు ప్రారంభించనున్నారు. రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖతో కలిసి నగరంలోని నిరుపేదలు అధికంగా నివసించే మురికివాడలు, బస్తీలలో "బస్తీ దవాఖాన'' లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది.

నగరంలో నిర్వహిస్తున్న ఈ 200 బస్తీ దవాఖానలు నిరుపేదలకు బస్తీవాసులకు మెరుగైన వైద్య పరీక్షలను అందజేస్తున్నందున మరో 24 బస్తీ దవాఖానలను మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహ్మూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, డిప్యూటి స్పీకర్ పద్మారావు, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ లు వివిధ ప్రాంతాల్లో ప్రారంభిస్తారని నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సంబంధిత పార్లమెంట్, శాసన మండలి, శాసన సభ్యులు, కార్పొరేటర్లు పాల్గొంటారని మేయర్ రామ్మోహన్ తెలిపారు.
 
ప్రారంభం కానున్న బస్తీ దవాఖానల జాబితా:

క్ర.సంఖ్య

బస్తీ దవాఖాన

ప్రారంభంకులు

1

అంబర్ పేట్ సర్కిల్ - మౌలాన ఆజాద్ నగర్ కమ్యునిటీహాల్

మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్

2

ఖైరతాబాద్ సర్కిల్ - సయ్యద్ నగర్ ఎమ్మెల్యే కాలనీ

మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.ఆర్

3

సికింద్రాబాద్ సర్కిల్ –  పార్సిగుట్ట, పద్మారావు నగర్

డిప్యూటి స్పీకర్ పద్మారావు

4

సికింద్రాబాద్ సర్కిల్ - ఇందిరానగర్

డిప్యూటి స్పీకర్ పద్మారావు

5

ఖైరతాబాద్ సర్కిల్- బి.ఎస్.మక్త కమ్యునిటీహాల్

ఆరోగ్య శాఖ మంత్రి ఈటెలరాజేందర్

6

చార్మినార్ సర్కిల్ – పత్తర్ గట్టి 

హోం మంత్రి మహ్మూద్ అలీ

7

మలక్ పేట్  సర్కిల్ – దారుల్ షపా

హోం మంత్రి మహ్మూద్ అలీ,

8

చాంద్రాయణగుట్ట – ఈది బజార్

హోం మంత్రి మహ్మూద్ అలీ,

9

ముషిరాబాద్ – ఎంసిహెచ్ ప్లే గ్రౌండ్, రాంనగర్

పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని

10

గోషామహల్ – మంగళహాట్ ఈస్ట్

పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని

11

ముషిరాబాద్ – జవహర్ నగర్, కవాడిగూడ

పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని

12

కార్వాన్ – మరాఠి బస్తీ రోడ్, కార్వాన్ ఈస్ట్

నగర మేయర్ బొంతు రామ్మోహన్

13

మెహిదీపట్నం  – సాబేర్ నగర్ కాలనీ సయ్యద్ అలీ గూడ

నగర మేయర్ బొంతు రామ్మోహన్

14

సంతోష్ నగర్ – తలాప్ కట్ట

నగర మేయర్ బొంతు రామ్మోహన్

15

చార్మినార్ సర్కిల్ – మిస్రీగంజ్, రాంనాస్ పుర

నగర మేయర్ బొంతు రామ్మోహన్

16

చార్మినార్ సర్కిల్ – సుల్తాన్ షాహీ, గౌలిపుర

నగర మేయర్ బొంతు రామ్మోహన్

17

ఖైరతాబాద్ సర్కిల్- ముజాహిద్ నగర్, సీతారాంబాగ్

డిప్యూటిమేయర్ బాబాఫసియుద్దీన్

18

సంతోష్ నగర్ సర్కిల్ – పటేల్ నగర్ హాల్, లాల్ దర్వాజ

డిప్యూటిమేయర్ బాబా సియుద్దీన్

19

మూసాపేట్ – పిల్లర్ నెం.ఏ827, కూకట్ పల్లి 

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

20

మూసాపేట్ – అవంతినగర్ ఎర్రగడ్డ

కార్మిక శాఖ మంత్రి మల్లారడ్డి

21

కుత్బుల్లపూర్ – దత్తాత్రేయ నగర్

వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

22

మల్కాజ్ గిరి సర్కిల్ – నేరేడ్ మెట్

 కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

23

మల్కాజ్ గిరి సర్కిల్ – స్ట్రీట్ నెం.29, గౌతం నగర్

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

24

సరూర్ నగర్ – భరత్ సింగ్ నగర్, వెంకటేశ్వర కాలనీ

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

More Press Releases