తెలంగాణ సీఎం సహాయనిధికి సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ గ్రూప్ రూ.50 లక్షల విరాళం

Related image

తెలంగాణ రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాల కోసం 50 లక్షల రూపాయల చెక్కను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు తమ వంతు సాయంగా సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ గ్రూప్ ప్రెసిడెంట్ కె.గణేశ్ గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అందించారు.

గత రెండు వారాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పంటలు ఎంతో దెబ్బతిని రైతులు నష్టపోయారని, జన జీవితం స్తంబించిందని ఇందుకుగాను ప్రభుత్వం అమలుపరుస్తున్న సహాయ కార్యక్రమాలకు తమ వంతు సాయంగా 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ అందించింది.

More Press Releases