వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దంపతులు

Related image

  • వ‌రంగ‌ల్ - హన్మకొండ వేయిస్తంభాల గుడిలో రుద్రేశ్వర స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు - ఉషా దయాకర్ రావు దంపతులు, వారి బావ భాస్కర్ రావు త‌దిత‌రులు
  • మంత్రి ఎర్రబెల్లి దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, ఈఓ
  • రుద్రేశ్వరుడి అభిషేకం చేసి, ద‌ర్శించుకుని మొక్కులు తీర్చుకున్న ఎర్ర‌బెల్లి దంప‌తులు
  • అనంత‌రం ఆల‌యంలో దేవిన్న‌వ రాత్రుల సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన అమ్మ‌వారి విగ్ర‌హం వ‌ద్ద పూజ‌లు చేసిన మంత్రి దంప‌తులు
  • ఆల‌య అభివృద్ధి, స్థితిగ‌తులు త‌దిత‌ర అంశాల‌పై ఇఓ, అర్చ‌కుల‌తో చ‌ర్చించిన మంత్రి
  • ద‌ర్శ‌నానంత‌రం మంత్రికి ఆశీర్వ‌చ‌నం ఇచ్చి, స్వామివారి ప‌ట్టు వ‌స్త్రాలు బ‌హూక‌రించిన వేయిస్తంభాల గుడి అర్చ‌కులు
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్:

  1. రుద్రేశ్వరుడిని ద‌ర్శించుకోవ‌డం సంతోషంగా ఉంది
  2. సిఎం కెసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ సుభిక్షంగా ఉండాల‌ని కోరుకున్నాను  
  3. కరోనా మహమ్మారి నుండి ప్రపంచాన్ని కాపాడాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా వుండాలని ఆకాంక్షించాను.
  4. అతి పురాత‌న‌, కాక‌తీయుల నాటి, ఎంతో పాటి ఉన్న ఆల‌యం వేయిస్తంభాల గుడి
  5. భ‌ద్ర‌కాళి దేవాల‌యానికి, వేయి స్తంభాల రుద్రేశ్వ‌రాల‌యానికి ఎంతో అనుబంధం ఉంది
  6. ఈ రెండు దేవాల‌యాలూ కాక‌తీయుల కాలంలో నిర్మిత‌మైన‌వే
  7. ఆనాడు కాక‌తీయ రాజులు ఈ గుడికి, భ‌ద్ర‌కాళి దేవాల‌యానికి ప్ర‌తి రోజూ వ‌చ్చి పూజ‌లు చేసే వార‌ని ప్ర‌తీతి
  8. వేయి స్తంభాల గుడికి పూర్వ వైభ‌వం తేవ‌డానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారు.
  9. కేంద్ర ప‌రిధిలో ఉన్న ఆర్కియాల‌జీ విభాగం నిర్ల‌క్ష్యం, అల‌క్ష్యం వ‌ల్ల దేవాల‌య అభివృద్ధి కుంటుప‌డుతున్న‌ది
  10. అవ‌స‌ర‌మైతే, కేంద్రంతో చ‌ర్చించి వేయి స్తంభాల గుడిని అభివృద్ధి ప‌ర‌చ‌డానికి కృషి చేస్తాం
  11. వేయి స్తంభాల గుడి పునః ప్ర‌తిష్ట కార్య‌క్ర‌మం తొంద‌ర‌గా ముగిసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈవోని ఆదేశించిన మంత్రి
  12. దేవిన్న‌వ‌రాత్రులు, బ‌తుక‌మ్మ‌, ద‌స‌రా పండుగ‌ల‌కు పెట్టింది పేరు వ‌రంగ‌ల్
  13. వ‌రంగ‌ల్ నుంచే బ‌తుక‌మ్మ‌, దేవిన్న‌వ‌రాత్రులు కార్య‌క్ర‌మాలు ప్రారంభ‌మ‌య్యాయి
  14. బ‌తుక‌మ్మ పండుగ స‌హా, తెలంగాణ పండుగ‌లు, ప‌బ్బాలు అన్నీ నిర్ల‌క్ష్యానికి గుర‌య్యాయి
  15. బ‌తుక‌మ్మ సంస్కృతిని జాగృతి సంస్థ ద్వారా క‌ల్వ‌కుంట్ల క‌విత గారు విశ్వ వ్యాప్తం చేశారు.
  16. మ‌హిళ‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా సాంస్కృతిక స‌మైక్య‌త‌ను తీసుకువ‌చ్చారు
  17. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత పండుగ‌ల‌ ప‌రిస్థితిలో మార్పు వ‌చ్చింది.
  18. బ‌తుక‌మ్మ పండుగ‌ని రాష్ట్ర పండుగ‌గా జ‌రుపుకుంటున్నాం
  19. మ‌హిళ‌ల‌కు బ‌త‌కుమ్మ చీర‌ల‌ను, త‌మ సొంతింటి ఆడ‌ప‌డ‌చుల‌కు సారెలాగా కెసిఆర్ ఇస్తున్నారు
  20. తెలంగాణ‌లో చారిత్ర‌క‌, సాంస్కృతిక‌, భ‌క్తి, అభివృద్ధి, సంక్షేమ వైభ‌వం న‌డుస్తున్న‌ది
  21. అందుకే సీఎం కెసిఆర్ ప్ర‌భుత్వం, ప్ర‌పంచం, ప్ర‌జ‌లు అంతా బాగుండాల‌ని కోరుకుంటున్నాను
  22. వేయి స్తంభాల ఆల‌య అభివృద్ధికి మ‌రింత కృషి జ‌రుగుతున్న‌ది
  23. మొత్తం వ‌రంగ‌ల్ న‌గ‌రాన్ని హైద‌ర‌బాద్ త‌ర‌హాలో, అభివృద్ధి ప‌రిచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది.
  24. కుడా ప‌రిధిలోనూ అద్భుత అభివృద్ధికి ప్ర‌ణాళిక సిద్ధ‌మైంది
  25. ప్ర‌జ‌ల్లో కాక‌తీయుల కాలం నాటి నుండీ ఆ ప్రాశ‌స్త్యం కొన‌సాగుతున్న‌ది
  26. ప్ర‌జ‌ల న‌మ్మ‌కాలు, ఆలోచ‌న‌లు, అవ‌స‌రాల‌క‌నుగుణంగా తెలంగాణ‌లో సిఎం కెసిఆర్ ఆధ్వ‌ర్యంలో ప‌రిపాల‌న సాగుతున్న‌ది
ఈ కార్య‌క్ర‌మంలో వ‌రంగ‌ల్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ స‌దానందం, ఆల‌య ఇఓ, అర్చ‌కులు, స్థానిక కార్పొరేట‌ర్, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

More Press Releases