నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించిన తెలంగాణ స్పీకర్ పోచారం

Related image

కామారెడ్డి జిల్లా: నిజాంసాగర్ మండలం నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించి, మంజీరా నదికి హారతి ఇచ్చి పూజలు చేసిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి. పాల్గొన్న జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా ZP చైర్మన్ ధఫేదార్ శోభా రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు.

ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మొట్టమొదటి బహుళార్థసాధక ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడం సంతోషమని అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టు నిండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రాజెక్టులోని నీరు నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు రెండు పంటలకు సరిపోయేంత వరకు అందుతుందని ఆయన అన్నారు. రైతులు రెండో పంటకు సిద్ధం కావాలని, రైతుల కోరిక మేరకు ఎప్పుడూ నీళ్లు అడిగిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్పీకర్ పోచారం తెలిపారు.

బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు: స్పీకర్

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుని మహిళలు బతుకమ్మను జరుపుకోవాలని కోరారు.

More Press Releases