పిఎంజిఎస్ వై ప‌నులు వేగంగా పూర్తి కావాలి: మంత్రి ఎర్ర‌బెల్లి

Related image

  • స‌మీక్షించిన రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు
హైద‌రాబాద్, అక్టోబ‌ర్ 16ః పిఎంజిఎస్ వై రోడ్ల పనులు సాధ్య‌మైనంత వేగంగా పూర్తి చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అధికారుల‌ను ఆదేశించారు. నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో, నిర్ణీత‌కాలంలో ఆయా ప‌నులు పూర్త‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి సూచించారు. హైద‌రాబాద్ లోని రంగారెడ్డి జిల్లా ప‌రిష‌త్ కార్యాల‌యంలో గ‌ల‌ పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆఫీసులోని త‌న చాంబ‌ర్ లో మంత్రి సంబంధిత శాఖ‌, పంచాయ‌తీరాజ్ ఇంజ‌నీరింగ్ శాఖ‌ల అధికారుల‌తో శుక్ర‌వారం ఆయా ప‌నుల‌పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడుతూ, ప్ర‌ధాన మంత్రి గ్రామీణ స‌డ‌క్ యోజ‌న పథ‌కం కింద మ‌న రాష్ట్రానికి మంజూరైన దాదాపు 158 రోడ్ల ప‌నుల ప్ర‌గ‌తి మీద మంత్రి ఒక్కో అంశం వారీగా చ‌ర్చించారు. ఆయా ప‌నుల‌ను స‌త్వ‌ర‌మే పూర్తి చేయాల‌న్నారు. నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఉన్న ప‌నుల‌ను మొద‌టి ప్రాధాన్య‌త‌గా, ఇబ్బందులున్న ప‌నుల స‌మ‌స్య‌ల‌ను వెంట వెంట ప‌రిష్క‌రిస్తూ వాటిని కూడా రెండో ప్రాధాన్యాంశాలుగా పూర్తి చేయాల‌ని మంత్రి ఆదేశించారు. ఆయా ప‌నుల‌ను అధికారులు స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించాల‌ని మంత్రి సూచించారు. ఈ స‌మీక్ష స‌మావేశంలో సంబంధిత శాఖ‌ల ఇఎన్ సి, సిఇలు, డిఇఇలు, ఎఇలు త‌దిత‌ర‌ అధికారులు పాల్గొన్నారు.

More Press Releases