ప్రతిపాదిత టూరిజం ప్రాజెక్టులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నత స్థాయి సమీక్ష

Related image

హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రతిపాదిత టూరిజం ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంను టూరిజం హబ్ గా తీర్చిదిద్దటానికి రూపొందించిన నూతన ప్రాజెక్టుల ప్రతిపాదనల అమలుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేస్తున్న టూరిజం ప్రాజెక్టుల కోసం నిర్ధేశిత ప్రతిపాదిత స్థలాల్లో టూరిజం ప్రాజెక్టుల డిజైన్ లను అనుభవం ఉన్న కన్సల్టెంట్ ల ద్వారా రూపొందించి వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికై నూతనంగా ఏర్పాటు చేయబోతున్న ప్రాజెక్టులపై ప్రముఖ కన్సల్టెంట్ లు రూపొందించిన ప్రాజెక్టును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లను మంత్రి పరిశీలించారు. హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ చుట్టూ మోనో రైల్ ప్రాజెక్ట్ పై HMDA అధికారులతో సంప్రదించి ప్రాజెక్టు రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కి ప్రముఖ సంస్థలతో చర్చించి దుర్గం చెరువులతో పాటు కాళేశ్వరం, మిడ్ మానేరు, కొండ పోచమ్మ, సోమశిలలో కొత్తగా చేపట్టనున్న టూరిజం ప్రాజెక్టుల ప్రతిపాదనలపై మంత్రి అధికారులతో చర్చించారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల, IT శాఖల ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టూరిజం శాఖ కార్యదర్శి KS శ్రీనివాస రాజు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమెయ్ కుమార్, అదనపు కలెక్టర్ హరీష్, ప్రముఖ నటుడు మంచు మనోజ్, టూరిజం MD మనోహర్, టూరిజం శాఖ అధికారులు రవీందర్ రెడ్డి, కన్సల్టెంట్ లు పాల్గొన్నారు. 

More Press Releases