మొహర్రం పండుగ ఏర్పాట్లపై తెలంగాణ మంత్రుల సమీక్ష

Tue, Aug 11, 2020, 08:12 PM
Related Image హైదరాబాద్: ఈ నెలాఖరులో వస్తున్న మొహర్రం పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో  రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మరియు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీలు డిఎస్ఎస్ భవన్ లోని సమావేశ మందిరంలో మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. కరోనా మహమ్మారి తీవ్రత వలన కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పండగ జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అహ్మద్ భాషా ఖాద్రి, మైనారిటీ శాఖ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మహమ్మద్ సలీం, జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్, మైనారిటీ సంక్షేమ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)