డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను సందర్శించిన మంత్రి పువ్వాడ

Tue, Aug 11, 2020, 07:01 PM
Related Image ఖమ్మం నగరం 6వ డివిజన్ లోని టేకులపల్లిలో ఇంటిగ్రేటెడ్ డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. ఆయా పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. పనుల ఆలస్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కుంటి సాకులు చెప్పి పనులు ఆలస్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిర్మాణకు కావాల్సిన ఇసుక ఇప్పటికే అందించామని ఇకనైనా సకాలంలో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
 
నిరుపేదలు ఆత్మ గౌరవంతో బతకాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తున్నారని అన్నారు. నేడు టేకులపల్లిలో ఒకే సముదాయంలో 1081 ఇంటిగ్రేటెడ్ ఇళ్లు నిర్మించడం నిరుపేదలకు నిలువెత్తు గౌరవంగా నిలుస్తుందన్నారు.
 
దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేద ప్రజలకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సకల వసతులతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని తెలిపారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)