కోవిడ్ పరీక్షలు చేయించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

Mon, Jul 27, 2020, 03:20 PM
Related Image
  • మనమంతా మనుషులం... మానవీయతను చాటుదాం
  • కరోనా పేషంట్లను కరుణతో చూద్దాం
  • గ్రామాల్లో అంత్యక్రియలకు అనుమతిద్దాం
  • మంత్రి కి కరోనా నెగెటివ్ రిపోర్ట్
  • ప్రజల్లో ధైర్యాన్ని నింపండి... తప్పుడు ప్రచారాలు చేయొద్దంటూ... మీడియా, సోషల్ మీడియాకు విజ్ఞప్తి
హైదరాబాద్/వరంగల్, జూలై 27: మనమంతా మనుషులం..సాటి మనుషుల మీద మానవత్వాన్ని చాటుదాం. మన తోటి వాళ్లందరినీ గౌరవిద్దాం. మరీ ముఖ్యంగా కరోనా పేషంట్లని కరుణతో చూద్దాం. కరోనా బాధిత శవాలకు గ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించేలా అనుమతిద్దాం...అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాక్షేత్రంలో తనతోపాటు విస్తృతంగా తిరిగిన తన సిబ్బందిలో కొందరికి పాజిటివ్ రావడంతో మంత్రి, సోమవారం ఉదయం తాను స్వయంగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కి కరోనా నెగెటివ్ రిపోర్టు వచ్చింది. తాను ముందుగానే చెప్పినట్లు తాను ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచిన తన అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలందరికీ మంత్రి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, కరోనా వైరస్ సామాజిక సమస్యగా పరిణమించిందన్నారు. ఈ సమస్యకు ఓ పరిష్కారం లేకపోవడం, మందులు రాకపోవడం ఓ విచిత్రమై విపరీతంగా మంత్రి పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు సైతం ఆందోళన చెందుతున్నాయన్నారు. ఇందుకు మనం, మన దేశం, రాష్ట్రం ఎవరూ అతీతులం కాదని మంత్రి చెప్పారు. స్వీయ నియంత్రణ పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతని, పరిసరాల పారిశుద్ద్యాన్ని సమర్జతవంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే మాస్కులను ధరించడం, అవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్ళకుండా ఉండటం చేయాలని చెప్పారు. ప్రజలు కూడా ఆందోళన చెందొద్దని, కాస్త సంయమనంతో వ్యవహరించాలన్నారు. సిఎం కెసిఆర్ సాహసోపేత నిర్ణయాల వల్ల మన రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణలోనే ఉందని, కరోనా వైరస్ బాధితుల కోసం అవసరమైన మందులు, పరికరాలు, పరీక్షలు కిట్లు, వైద్య నిర్వహణకు అవసరమైన ఇతర సదుపాయాలు సిద్జంగా ఉన్నాయన్నారు.

అనుమానంగా ఉంటే వెంటనే సమీప ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించుకోవాలని, తగు రీతిలో క్వారంటైన్ లో ఉండాలని, కరోనా కట్టడి అయ్యే వరకు ప్రజలు మరికొద్ది కాలం అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)