రవాణా శాఖలో కొత్త ప్రయోగాలకు మంత్రి పువ్వాడ శ్రీకారం

Fri, Jul 24, 2020, 08:22 PM
Related Image హైదరాబాద్: రవాణా శాఖలో కొత్త ప్రయోగాలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులకు అన్ని రకాల సేవలు అందించేందుకు అన్ని చర్యలు ఇప్పటికే చేపట్టారు. శుక్రవారం రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మరో 5 సేవలు ఆన్లైన్ ద్వారా పొందే వేసులుబాటును కల్పించారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ శాఖ సమన్వయంతో 1)డూప్లికేట్ LLR పొందుట, 2) డూప్లికేట్ లైసెన్స్ పొందుట 3) బ్యాడ్జి మంజూరు 4) స్మార్ట్ కార్డ్ పొందుట(పాత లైసెన్స్ సమర్పించి కొత్తది పొందుట) 5) లైసెన్స్ హిస్టరీ షీట్ పొందుట సేవలను మంత్రి పువ్వాడ ఆవిష్కరించారు. ఆయా సేవలు ఇక నుండి పూర్తి ఆన్లైన్ లోనే పొందవచ్చు అని పేర్కొన్నారు.

అక్రమాలకు అడ్డుకట్ట వేసి పారదర్శక పాలన అందించేందుకు ఇప్పటికే ఆధార్‌ను తప్పనిసరి చేశామని, ఇప్పటికే అనేక సేవలను ఆన్‌లైన్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు వినియోగించుకుంటున్నారని అన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగనవసరం లేదు. మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించాల్సిన అవసరం అసలే ఉండదు. ఈ నూతన విధానం ద్వారా రిజిస్ట్రేషన్‌ సేవలను ఆన్‌లైన్‌ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజల వెసులుబాటు కోసం శాఖలో మరిన్ని సేవలు మరింత తేలికపాటిగా పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

తాజాగా ప్రతిపాదించిన నూతన విధానంతో రవాణా శాఖ మరో అడుగు ముందుకేసి ఈ 5 సేవలు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. దరఖాస్తుదారుడు ఇంట్లోనే కంప్యూటర్‌ ముందు కూర్చొని వాహన్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేసి తనకు కావలసిన సేవలను దరఖాస్తు చేసుకోవచ్చుని,  దరఖాస్తుదారుడు తన వాహనాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించాలంటే దానికి సంబంధించిన అన్ని పత్రాలను ఆన్‌లైన్‌లో పంపాల్సి ఉంటుందన్నారు. 
 
ఆన్‌లైన్‌ సేవలను ప్రజలు  వినియోగించుకోవాలని రవాణా శాఖలో వస్తున్న సంస్కరణలకు అనుగుణంగా ప్రజలు సేవలను పొందాలని మంత్రి కోరారు. వినియోగించుకోవాలి. నూతనంగా అమల్లోకి వచ్చిన ఆన్‌లైన్‌ విధానం ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరమని మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా కావాల్సిన సేవలను పొందాలని కోరారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)