శ్రీరాం సాగ‌ర్ నుంచి- స‌ర‌స్వ‌తీ కాలువకు నీటిని విడుద‌ల చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

Fri, Jul 24, 2020, 03:39 PM
Related Image నిర్మ‌ల్, జూలై 24: అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శ్రీరాం సాగ‌ర్ ప్రాజెక్ట్ నుంచి శుక్ర‌వారం స‌ర‌స్వ‌తీ కాలువ‌కు నీటిని విడుదల చేశారు. పూజలు చేసి నీళ్లు వదిలారు. పోచంపహాడ్ వద్ద ప్రత్యేక పూజలు చేసి, స్విచ్ నొక్కి మంత్రి కాలువ నీళ్లను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానకాలం పంటలకై వార‌బందీ ప‌ధ్ద‌తిలో నీటిని విడుద‌ల చేస్తున్నామన్నారు. 35 వేల ఎక‌రాల‌కు పైగా చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు సాగు నీరు అందిస్తామని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సరస్వతీ కెనాల్ నీటితో చెర్లను కూడా నింపుకోవాలని సూచించారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)