కోవిడ్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం!

Fri, Jul 10, 2020, 06:39 PM
Related Image కోవిడ్ తో ప్రపంచ వ్యాప్తంగా పోరాడుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ కష్ట కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్య వంతులను చేసేందుకు అలుపెరుగని పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కోవిడ్ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తుంది.

ఈ కాల్ సెంటర్ ద్వార కోవిడ్ పాజిటివ్ వచ్చిన రోగులకు ఇంటి వద్దే వుంటూ హోం ఇసోలేషన్లో భాగంగా తీసుకోవలసిన చర్యలు గూర్చి కౌన్సిలింగ్ ద్వార తెలియజేస్తుంది. సాదారణ పరిస్థితులలో రోజు వారిగా 17 రోజుల పాటు కాల్ సెంటర్ నుండి నిపుణులు ఫాలో అప్ చేస్తున్నారు. మైల్డ్ లక్షణాలు వున్నా వారికీ టెలి మెడిసిన్ కన్సల్టేషన్ ద్వారా వైద్య సలహాలు అందిస్తున్నారు. కాల్ సెంటర్ సిబ్బంది రెండు విడతలలో సుమారు 200 మంది కాల్లెర్స్ తో నిరంతరాయంగా పని చేస్తుంది. హోం ఇసోలేషన్లో వున్నా సుమారు పది వేల మంది కోవిడ్ రోగులు తీసుకోవలసిన జాగ్రతలు, సమతూల్య ఆహారం, వారి ఆరోగ్య పరిస్థితి గూర్చి తెలుసుకోవడమే కాకుండా సలహా లు, సూచనలు చేస్తున్నారు.

ప్రతి రోజు సుమారు ఐదు వందల మంది రోగులకు ప్రాధాన్యత ఆధారంగా టెలి మెడిసిన్ ద్వార వైద్య సలహాలు అందజేస్తున్నారు. ఎవరైనా కోవిడ్ భాదితులు తీవ్రమైన శ్వాస సంబంధమైన సమస్య లేదా ఛాతి నొప్పితో బాధపడుతుంటే వారి వివరాలను సేకరించి వెంటనే 108 ద్వారా మెరుగైన వైద్య  సౌకర్యం అందించేందుకు ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది.

కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ - 18005994455 కు హోం ఇసోలేషన్ లో రోగితో పాటు రోగికి సేవలు అందించేవారు తీసుకోవలసిన జాగ్రతలపై సూచనలు చేయడం జరుగుతుంది. కోవిడ్ కు సంబంధించి ఏమైనా సూచనలు, సలహాలు తెలుసుకోవాలి అనుకునేవారు కోవిడ్ కాల్ సెంటర్ కు కాల్ చేసి తమ సందేహాలను నివృతి చేసుకోవచ్చు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)