మ‌రో ఫ్లైఓవ‌ర్ కు ఈ నెల 11న‌ శంకుస్థాప‌న చేయ‌నున్న మంత్రి కేటీఆర్

Thu, Jul 09, 2020, 06:53 PM
Related Image
  • రూ. 426 కోట్ల‌తో నిర్మించే ఒక ఎలివేటెడ్ కారిడార్‌, మ‌రో ఫ్లైఓవ‌ర్ కు ఈ నెల 11న‌ శంకుస్థాప‌న చేయ‌నున్న మంత్రి కె.టి.ఆర్ - న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌
  • రూ. 350 కోట్ల‌తో ఇందిరా పార్కు నుండి వి.ఎస్‌.టి మొద‌టి ద‌శలో నిర్మించ‌నున్న‌ నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి
  • రూ. 76 కోట్ల‌తో రాంన‌గ‌ర్ నుండి బాగ్‌లింగంప‌ల్లి పేజ్‌‌-2 సెంక‌డ్ లేవ‌ల్ లో నిర్మించ‌నున్న 3 లేన్ ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జి
హైద‌రాబాద్‌, జూలై 09: రూ. 426 కోట్లతో నిర్మించే ఒకఎలివేటెడ్ కారిడార్‌, మ‌రో ఫ్లైఓవ‌ర్ కు ఈ నెల 11న రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.తార‌క‌రామారావు శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఇందులో భాగంగా రూ. 350 కోట్ల‌తో ఇందిరా పార్కు నుండి వి.ఎస్‌.టి మొద‌టి ద‌శలో నిర్మించ‌నున్న‌ నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జిని నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. అదేవిధంగా మ‌రో రూ. 76 కోట్ల‌తో రాంన‌గ‌ర్ నుండి బాగ్‌లింగంప‌ల్లి పేష్‌-2 సెంక‌డ్ లేవ‌ల్ లో నిర్మించ‌నున్న 3 లేన్ ఫ్లైఓవ‌ర్ బ్రిడ్జిని నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ ప‌నుల‌ను 24 నెల‌ల్లో పూర్తి చేయించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ ప‌నులు పూర్తైతే ఈ ప్రాంతంలో రాక‌పోక‌లు సాగిస్తున్న వేలాది వాహ‌న‌దారుల‌కు సౌల‌భ్యంగా ఉంటుంద‌ని తెలిపారు. న‌గ‌రాన్ని ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోగా తీర్చిదిద్దేందుకు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ద‌తో ప‌నులు మంజూరు చేస్తున్న‌ట్లు తెలిపారు.

 ఈ ప‌నుల‌కు సంబంధించిన ముఖ్య‌మైన వివ‌రాలు:

1. ప‌నిపేరు: ఇందిరా పార్కు నుండి వి.ఎస్‌.టి (ఫేజ్‌-1) వ‌ర‌కు నాలుగు లేన్ల రెండు వైపులా వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అనువుగా ఎలివేట‌ర్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం
పొడ‌వు: 2.620 కిలోమీట‌ర్లు
నిర్మాణ వ్య‌యం: రూ. 350 కోట్లు
స్ట్ర‌క్చ‌ర్ టైప్ : స్టీల్ బ్రిడ్జి

ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు:
  • ఇందిరా పార్కు స‌మీపం నుండి వి.ఎస్‌.టి జంక్ష‌న్ వ‌ర‌కు ఫ్రీ ఫ్లో ట్రాఫిక్‌
  • ప్ర‌యాణ స‌మ‌యం త‌గ్గుతుంది.
  •  హిందీ మ‌హా విద్యాల‌య‌& ఉస్మానియా యూనివ‌ర్సిటీల వైపు ట్రాఫిక్ స‌మ‌స్య తొలుగుతుంది.
  •   ఆర్టీసి క్రాస్ రోడ్ జంక్ష‌న్‌లో ట్రాఫిక్‌కు ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.
  •   ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్‌, అశోక్‌న‌గ‌ర్ క్రాస్ రోడ్‌, ఆర్టీసికాల‌నీ క్రాస్ రోడ్‌, బాగ్‌లింగంప‌ల్లి ట్రాఫిక్ స‌మ‌స్య తొలుగుతుంది.

2. ప‌ని పేరు: రాంన‌గ‌ర్ నుండి వ‌యా వి.ఎస్‌.టి ఆజామ‌బాద్ ద్వారా బాగ్‌లింగంప‌ల్లి వ‌ర‌కు ఫ్లైఓవ‌ర్ నిర్మాణం
పొడ‌వు: 0.850 కిలోమీట‌ర్లు
నిర్మాణ వ్య‌యం: రూ. 76 కోట్లు

స్ట్ర‌క్చ‌ర్ టైప్ : స్టీల్ బ్రిడ్జి
ఈ ప్రాజెక్ట్ నిర్మాణంతో క‌లిగే ప్ర‌యోజ‌నాలు:
  • ఈ ప‌ని పూర్తి అయితే రాంన‌గ‌ర్ నుండి బాగ్‌లింగంప‌ల్లి వ‌ర‌కు ట్రాఫిక్ ర‌ద్దీ స‌మ‌స్య తొల‌గి ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఏర్ప‌డుతుంది.
  • ట్రాఫిక్ స‌మ‌స్య తొల‌గి వాహ‌న‌దారుల స‌మ‌యం ఆదా అవుతుంది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)