మంత్రి ఎర్ర‌బెల్లిని క‌లిసిన వ‌రంగ‌ల్ ఇన్ చార్జీ సీపీ ప్ర‌మోద్ కుమార్

Mon, Jul 06, 2020, 04:10 PM
Related Image ప‌ర్వ‌త‌గిరి (వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా)ః వ‌రంగ‌ల్ ఇన్ చార్జీ సీపీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న వ‌రంగ‌ల్ రేంజ్ ఐజీ ప్ర‌మోద్ కుమార్ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. వ‌రంగ‌ల్ రూర‌ల్ జిల్లా ప‌ర్వ‌త‌గిరిలో ఉన్న మంత్రి వ‌ద్ద‌కు ఇన్ చార్జీ సీపీ సోమ‌వారం వెళ్ళారు. ఈ సంద‌ర్భంగా మంత్రితో కొద్దిసేపు సీపీ భేటీ అయ్యారు.

వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌రేట్ లోని శాంతి భ‌ద్ర‌త‌ల‌పై చ‌ర్చించారు. క‌రోనా క‌ట్ట‌డికి పోలీసులు తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను మంత్రికి సీపీ వివ‌రించారు. ఒక‌వైపు ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూనే, పోలీసులు కూడా జాగ్ర‌త్త‌గా ఉంటున్నామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి సీపీకి క‌రోనా క‌ట్ట‌డి, శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌పై ప‌లు జాగ్ర‌త్త‌లు చెప్పి, కొన్ని సూచ‌న‌లు చేశారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)