చర్లపల్లి ఓపెన్ ఏయిర్ జైలులో మొక్కలు నాటిన రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్

Sat, Jul 04, 2020, 05:34 PM
Related Image తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం లో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో ఈరోజు చెర్లపల్లి లోని సెంట్రల్ జైలు నందు ఖైదీలతో కలిసి  మొక్కలు నాటే కార్యక్రమం లో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్.

ఈ సందర్భంగా సంతోష్ కుమార్ ఖైదీలతో వారి యోగక్షేమాల గురించి మాట్లాడడం జరిగింది. అదే విధంగా ఖైదీలు వారికి ఉన్న సమస్యలను సంతోష్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీ సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తానని సంతోష్ కుమార్ హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మేయర్ బొంతు రాంమ్మోహన్, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్ రెడ్డి, జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జైళ్లశాఖ ఐజి సైదయ్య, డిఐజి ఎంఆర్ భాస్కర్, పర్యవేక్షణ అధికారి డాక్టర్ దశరథరామిరెడ్డి ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)