ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర: మంత్రి తలసాని వెల్లడి

Fri, Jul 03, 2020, 05:18 PM
Related Image కరోనా నియంత్రణ చర్యలలో భాగంగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ నెల 12 న సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరను సాంప్రదాయ బద్ధంగా నిర్వహించడం జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం మహంకాళి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో  దేవాదాయ శాఖ, పోలీసు శాఖ అధికారులతో పాటు ఆలయ ట్రస్టీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు.

ప్రతి ఏటా ఎంతో ఘనంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించే బోనాల జాతరను కరోనా మహమ్మారి కారణంగా ఈ సంవత్సరం 12 వ తేదీన జరిగే జాతర పూజలు, బోనాల సమర్పణ ఆలయం లోపల నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆలయ అధికారులు, పండితులు, ట్రస్టీ సభ్యులు మాత్రమే ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఇతరులు ఎవరిని అనుమతించబోరని, పరిస్థితులను అర్ధం చేసుకుని భక్తులు సహకరించాలని కోరారు.

అదేవిధంగా 13 తేదీన రంగం కూడా కరోనా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించబడుతుందని, దీనిని ప్రజలంతా వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. జాతర వద్ద పటిష్ట భద్రత కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, rjc రామకృష్ణ, ac బాలాజీ, ఈఓ లు మనోహర్, అన్నపూర్ణ, ఆలయ ట్రస్టీ కామేష్, మహంకాళి acp వినోద్, ci శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)