తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టీమ్స్) పై మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష

Sat, Jun 27, 2020, 09:58 PM
Related Image తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టీమ్స్) పై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించారు. టిమ్స్ లో ఐపి సేవలు అందించేందుకు అవసరమయిన సిబ్బంది నియామక ప్రక్రియ పూర్తి అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. సోమవారం నుండి వైద్యులు, సిబ్బంది విధుల్లో చేరనున్నారనీ ఈరోజు జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులు మంత్రికి వివరించారు. 499 పోస్టులకు 13వేల అప్లికేషన్లు వచ్చాయి. వాటిని స్క్రూటినీ పూర్తి చేసి ఎంపిక ప్రక్రియను పూర్తి చేశామన్నారు.

ప్రైవేట్ ల్యాబ్ ల పని తీరుపై వైద్య ఆరోగ్య శాఖ నియమించిన కమిటీ చేసిన తనిఖీల్లో మార్గ దర్శకాలు పాటించకుండా పరీక్షలు చేస్తున్న పలు లాబ్ లను గుర్తించారు. ప్రైవేట్ లాబ్ లు పోర్టల్ లో అప్లోడ్ చేస్తున్న పరీక్షల సంఖ్య, పాజిటివ్ కేసుల సంఖ్యలో ఉన్న అవకతకలపై కమిటీ విస్తృతంగా పరిశీలన ప్రక్రియ మొదలయ్యింది. కొన్ని లాబ్ లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 70 శాతం పాజిటివ్ రావడం పై పరీక్షా విధానంలో లోపాలు ఉన్నాయేమో అని నిపుణుల కమిటీ సునిశితంగా పరిశీలన చేయనుంది. పరిశీలన తరువాత అయా లాబ్ లో గుర్తించిన లోపాలను, నివారణ చర్యలు కూడా కమిటీ సూచించనుంది.

కమిటీ విష్రుత పరిశీలన తరువాత రెండు మూడు రోజుల్లో సరిఅయిన కేసుల వివరాలు కమిటీ తెల్చనుంది. ఈ అంశాలపై సమీక్షించిన మంత్రి తప్పులు చేస్తున్న లాబ్ లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అవకతవకలు గుర్తించిన పలు లాబ్ కు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ప్రైవేట్ లాబ్ లలో జరుగుతున్న పరీక్షల తీరుపై ప్రభుత్వ లాబ్ ల మాదిరిగా నిరంతర పర్యవేక్షణ, తరచుగా వాలిడేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. అన్నీ లాబ్ లు ఐసిఎంఆర్, ప్రభుత్వ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ లాబ్ లు లోపాలు సరిదిద్దుకొకపోతే కటిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.

మరోపక్క ప్రభుత్వ లాబ్ లలో పరీక్షల సంఖ్య పెంచే అంశంపై కూడా మంత్రి సమీక్షించారు. 6600 పరీక్షల సామర్థ్యం తో పని చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

సీజన్ మారటంతో తో జలుబు, జ్వరం, దగ్గు లక్షణాలు చాలా మంది ప్రజల్లో కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ సోకిన వారికి సైతం ఇలాంటి లక్షణాలు ఉండటంతో ప్రజల్లో మరింత భయాందోళనలను పెరుగుతున్న నేపథ్యంలో ఇంటింటికి సర్వే చేసి కరోనా లక్షణాలు నిర్ధారణ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. డోర్ టూ డోర్ ఫీవర్ సర్వే చేస్తున్నామన్నారు.

జంటనగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవడంపై ఈరోజు సుదీర్ఘంగా మంత్రి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నవారు కింగ్ కోటి హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, సరోజినీ దేవి ఐ హాస్పిటల్ , కొండాపూర్ , వనస్థలి పురం ఏరియా ఆస్పత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలైందిగా మంత్రి సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు.

ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం లో పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఈ రోజు బి ఆర్ కే ఆర్ భవన్లో జరిగిన సమీక్ష సమావేశంలో కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యులు డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి, కరోనా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్, ప్రొఫెసర్ విమలా థామస్ పాల్గొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)