పంటల సాగుబడి తీరుని పరిశీలించిన తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి

Sat, Jun 27, 2020, 07:23 PM
Related Image లాక్ డౌన్ సమయంలోనూ నిరంతరం ప్రజల మధ్య తిరుగుతున్న రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు దొరికిన విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, శనివారం తన వ్యవసాయ క్షేత్రాన్ని తమ సతీమణి, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావుతో సహా వరంగల్ రూరల్, అర్బన్ జిల్లాల ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి వ్యవసాయ క్షేత్రంలోని మొక్కలను, చెట్లను, పంటలను పరిశీలిస్తూ ఇంకేమైనా పంటలు వేస్తే ఎలా వుంటుంది అనే దానిపై ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ తో కలిసి సమాలోచనలు జరిపారు. స్వతహాగా రైతు అయిన మంత్రి ఆయా పంటల విషయంలో క్షేత్రంలో పని చేస్తున్న కార్మికులకు తగు సూచనలు చేశారు. పంటల సాగుబడి తీరుని పరిశీలించారు. క్షేత్రంలో కూలీలను పలకరించి, పనులు సాగుతున్న వైనాన్ని ఆరా తీశారు. క్షేత్రం సమీపంలో పనులు చేసుకుంటున్న రైతులు, వారి పిల్లలను పలకరించారు. కరోనా వైరస్ విస్తృతినీ వివరించి, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. అలాగే వాళ్లకు మాస్కుల ను పంపిణీ చేశారు.

మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్:
  • కరోనా నుంచి ఎవరికి వారే కాపాడుకోవాలని సూచించారు
  • ఇష్టానుసారం తిరగకుండా, ఈ సమయాన్ని సొంత పనులు, వ్యవసాయ పనులకు కేటాయించాలన్నారు
  • కుటుంబ జీవనం అద్భుతమని, వ్యవసాయంలో ఉన్న ఓ తృప్తి ఉందన్నారు
  • పచ్చని చేను, చెలకలు ఆహ్లాదాన్ని ఇస్తాయని, ఆయుషును పెంచుతాయి
  • సీఎం కేసిఆర్ చెప్పినట్లు రైతులు నియంత్రిత పంటలను సాగు చేయాలి
  • లాభసాటి పంటలతో రైతులు బాగుపడాలి
  • రైతులను రాజును చేయాలనేది సీఎం కేసిఆర్ లక్ష్యం
  • హరిత హారంలో ప్రజలంతా భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)