సమాజ అవసరాలను బట్టి సిలబస్ ఉండాలి: వినోద్ కుమార్

Thu, Jun 25, 2020, 08:44 PM
Related Image
  • విద్యా విధానం లోపాలు, సవాళ్లపై చర్చ జరగాలి
  • విద్యా, ప్రణాళికా, పారదర్శకత పై త్వరలో సమగ్ర నివేదిక
  • యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్ దేవ్ తోరట్, ఢిల్లీ నైపా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వర్గీస్ అభిప్రాయం
  • సెకండరీ నుంచి ఉన్నత విద్య విధానంపై సూచనలు ఇవ్వండి
  • తోరట్, వర్గీస్ లను కోరిన రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
  • విద్యా విధానం, ప్రణాళికా, పారదర్శకత పై వెబినార్ లో పాల్గొన్న తోరట్, వర్గీస్, వినోద్
సమాజ అవసరాలను బట్టి సిలబస్ ఉండాలని, అందుకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలనీ యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్ దేవ్ తోరట్, ఢిల్లీ నైపా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్. వీ వర్గీస్ అభిప్రాయపడ్డారు. గురువారం " విద్యా విధానం, ప్రణాళికా, పారదర్శకత " అనే అంశంపై జరిగిన వెబినార్ లో వినోద్ కుమార్ పలు అంశాలను వారితో పంచుకున్నారు. మెరుగైన విద్యను విద్యార్థులకు అందించేందుకు నిరంతరం విద్యపై మేధోమధనం జరగాల్సిన అవసరం ఉందని వారు వినోద్ కుమార్ తో అన్నారు.

టీచింగ్, లర్నింగ్, పరీక్షల విధానంలో మార్పులు రావాలని, ఎప్పటికప్పుడు విద్యా విధానంపై డిబేట్స్ జరగాలని తోరట్, వర్గీస్ లతో కలిసి వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బాల, బాలికలకు రెసిడెన్షియల్ స్కూల్స్ లను పెద్ద ఎత్తున ప్రారంభించినట్లు తోరట్, వర్గీస్ లకు వినోద్ కుమార్ వివరించారు. కేజీ నుంచి పీజీ దాకా నాణ్యమైన, మెరుగైన విద్యను విద్యార్థులకు అందించాలని కోరుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తోరట్, వర్గీస్ లను వినోద్ కుమార్ వివరించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మొదటి తరం ఎస్సి, ఎస్టీ వర్గాలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారిని ఉన్నత విద్యలో ఇతరులతో పోటీ ప్రపంచంలో ముందుకు సాగేందుకు అవకాశాలు ఉండాలని వారు పేర్కొన్నారు.

సెస్, ఉన్నత విద్యామండలి మధ్య అవగాహన ఒప్పందంతో సాక్ష్యాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని నిర్ణయించారు. ఈ వెబినార్ లో యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్ దేవ్ తోరట్, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ఛాన్సలర్ ఎన్ వీ వర్గీస్, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ లు లింబాద్రి, వెంకట రమణ, సెస్ చైర్మన్ రాధాకృష్ణ,  డైరెక్టర్ ప్రొ రేవతి, తదితరులు పాల్గొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)