83 లక్షల మొక్కల నాటడమే లక్ష్యం: మంత్రి జగదీశ్ రెడ్డి

Thu, Jun 25, 2020, 03:08 PM
Related Image
 • చెట్ల పెంపకం ప్రాధన్యత గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్
 • హరితహారం పేరుతో ప్రజల్లో చైతన్యం
 • రాష్ట్రంలో అడవుల పెంపకానికి పెద్దపీట
 • హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పచ్చని శోభ
 • పర్యావరణ సమస్య ప్రపంచానికి సవాల్ విసురుతోంది
 • మానవజాతి ఎదుర్కొంటున్న సమస్య
 • వాతావరణంలో మార్పులు వాయు కాలుష్యంతో  ప్రాణాంతక వ్యాధులు ప్రబలడం
 • వర్షాలు తగ్గడమే అందుకు కారణం
 • దానికి పరిష్కారం అడవులు పెంపకమే
 • మొక్కలు పెంపకం అన్నది అటవీ శాఖకే పరిమితం అనుకున్నారు
 • ప్రజల్లో చెట్లపెంపకంపై నిర్లిప్తత ఉండేది
 • దానిని అధిగమించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం
 • కోవిడ్-19 జాగ్రత్తలు పాటిస్తూనే హరితహారం విజయవంతం చెయ్యాలి
 • సూర్యపేట జిల్లా కేంద్రంతో పాటు ఇమాంపేట, నెరేడుచర్ల మండలం పెంచేకల్ దీన్నే లలో ఘనంగా హరితహారం ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి
 • హాజరైన జడ్ పి చైర్మన్ దీపికా యుగంధర్ రావు,రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ,శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి,మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణమ్మ లు
చెట్ల పెంపకం ప్రాధాన్యతను మొదట గుర్తించింది ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే హరితహారం పేరుతో గడిచిన ఆరు ఏండ్లుగా చైతన్యం తీసుకొచ్చి మొక్కల పెంపకంలో పోటీ పడేలా చేసిన ఘనత ముమ్మాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ దే నన్నారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో బాగంగా గురువారం ఉదయం ఆయన సూర్యపేట పురపాలక సంఘం పరిధిలోని 9 వ వార్డులో ఏకకాలంలో 1050 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ సమస్య ప్రపంచానికి సవాల్ విసురుతున్న నేపధ్యంలో అడవుల పెంపకంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి సత్ఫాలితాలు సాదించిందన్నారు. మొదటి విడత హరితహారంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా మొక్క నాటి ప్రారంభించిన హరితహారం తోటే ఇప్పుడు ఆ జాతీయ రహదారిపై హరితశోభ వర్ధిల్లుతోందని చెప్పారు. పర్యావరణ సమస్యను అధిగమించాలి అన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని అందుకు అనుగుణంగా టార్గెట్లు పెట్టుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా కొనసాగిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.

మానవ జాతి ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో పర్యావరణం అతి ముఖ్యమైనదన్నారు. వాతావరణంలో మార్పులు జరిగి వాయు కాలుష్యంతో ప్రాణాంతకమైన వ్యాధులు ప్రబలడం కూడా అందులో ఒక బాగామేనని ఆయన చెప్పారు. వాటన్నింటికి కారణం వర్షాలు పడక పోవడమేనని అందుకు అడవులు అంతరించి పోవడమేనన్నారు. అటువంటి అడవుల పెంపకంపై దృష్టి సారించి మొక్కల పెంపకం ఒక ఉద్యమంలా కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. దానికి కొనసాగింపుగానే జిల్లాలో 83 లక్షల మొక్కలు నాటడం టార్గెట్ గా పెట్టుకుని హరితహారం ప్రారంభించుకున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, హుజుర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి, సూర్యపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, యస్ పి భాస్కరన్, డి ఆర్ ఓ మోహన్ రావు, డి ఆర్ డి ఏ పి డి కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)