ap7am logo

ఈసారి రైతు బంధుకు అదనంగా మరో 1500 కోట్లు కలిపి 7500 కోట్లు: తెలంగాణ మంత్రులు

Tue, Jun 23, 2020, 06:21 PM
Related Image వికారాబాద్ జిల్లా, బొంరాస్ పేట మండలంలో మెట్ల కుంట గ్రామంలో పి.డబ్ల్యు.డి రోడ్డు నుంచి మెట్లకుంట వరకు 1.15 కోటి రూపాయలతో నిర్మించిన బి.టి రోడ్డుని ప్రారంభించి, రైతు వేదికకు శంకుస్థాపన చేసి, సూర్యా నాయక్ తండాలో బి.టి రోడ్డు ప్రారంభించిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, స్థానిక నేతలు అధికారులు.

సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ కామెంట్స్:
 • తెలంగాణ రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రెటరీ గా ఎన్నికల ప్రచారం కోసం రెండేళ్ల క్రితం ఇక్కడకు వచ్చాను.
 • ఇక్కడ ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు..అప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే తండాలలో సరైన్ రోడ్డు వసతి, కరెంట్ లేక అభివృద్ధికి దూరంగా ఉన్నాయి.
 • ఆరోజు  ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదని తెలిసింది. ఆరోజు మేము చెప్పింది నమ్మి పట్నం నరేందర్ రెడ్డిని గెలిపించడం వల్ల దాదాపు 250 కోట్ల రూపాయల నిధులు వచ్చాయనడం సంతోషం.
 • ప్రజల కోసం ఇంతగా ఆలోచించే సీఎం గారిని మొదటి సారి చూస్తున్నాం.
 • తెలంగాణ గురించి అణువణువు తెలిసిన వ్యక్తి, ఉద్యమ నాయకుడు రాష్ట్రానికి సీఎం కావడం మన అదృష్టం.
 • తెలంగాణ వచ్చాక 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వడం వల్ల గతంలో వలె కరెంట్ మోటార్లు కాలిపోయే పరిస్థితి పోయింది.
 • తొలకరి పడగానే డబ్బు కోసం పేద రైతు ఇల్లాలి పుస్తె వైపు చూస్తారు. కానీ సీఎం కేసిఆర్ గారు రైతుకు ఆ పరిస్థితి ఉండొద్దు అని రైతు బందు పెట్టి పెట్టుబడి సాయం చేస్తున్నారు.
 • కరోనా కష్ట కాలంలో రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా అప్పు తెచ్చి రైతు బంధు ఇస్తున్నారు. కేసిఆర్ ఉన్నంత వరకు రైతు బందు ఆగదని చెప్పిన సీఎం కేసిఆర్ గారు.
 • ఈసారి రైతు బంధుకు అదనంగా మరో 1500 కోట్ల కలిపి 7500 కోట్లు ఇస్తున్నారు.
 • 25వేల రూపాయల లోపు రైతు రుణ మాఫీ కోసం రూ.1200 కోట్లు ఇచ్చారు.
 • రైతుకు గిట్టుబాటు అయ్యే పంట వేయాలని నియంత్రిత విధానం తెచ్చారు. తినే పంటను వేయాలని సన్నాలను ప్రోత్సహిస్తున్నారు.
 • గిరిజనులను ఓటు బ్యాంక్ గా చూస్తే సుమారు 4500 తండాలను గ్రామ పచాయితీలు చేసి పాలించుకునే అవకాశం కల్పించారు. గిరిజనులు ఎప్పటికీ రుణ పడి ఉంటారు.
 • స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్ని గిరిజన హాస్టళ్లు పెట్టారో సీఎం గా కేసిఆర్ వచ్చాక అంతకు రెండింతలు పెట్టారు.
 • కళ్యాణ లక్ష్మి కింద మేనమామ లాగా కట్నం ఇస్తున్నారు.
 • సీఎం కేసిఆర్ గారి ఆశీర్వాదం వల్ల పేదింటి మహిళ గా, తండాలో ఉన్న నేను మంత్రి అయ్యాను. ఈ రాష్ట్రంలో ఆయన బంటు గా గిరిజనుల అభివృద్ధి కి కృషి చేస్తాను.
 • 1.20 కోటి రూపాయలతో బంజారా భవన్ ఇక్కడ ఇస్తాను.
 • మా శాఖ ద్వారా జరిగే అన్ని రకాల లబ్ది చేకూర్చడానికి ఇక్కడ అధికారులతో సమావేశం పెట్టి సమన్వయం చేస్తాను.
 • మాయ మాటలు చెప్పే వారి నుంచి నేడు మీరు బయటకు వచ్చి కేసిఆర్ గారు, నరేందర్ రెడ్డి వైపునకు వచ్చారు. మార్గదర్శకులు అయిన మంత్రి నేతృత్వంలో ఈ ప్రాంతంలో చేతల ఫలితాలు చూస్తున్నారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి కామెంట్స్:

 • సీఎం కేసిఆర్ గారి మీద ఉన్న నమ్మకంతో నరేందర్ రెడ్డిని గెలిపించడం వల్ల గతంలో ఎప్పుడు జరగనంత అభివృద్ధి జరుగుతుంది.
 • సిరిసిల్ల నియోజక వర్గానికి ధీటుగా దీనిని అభివృద్ధి చేస్తామనడం ఈ నియోజక వర్గం సీఎంకున్న ప్రత్యేక శ్రద్ద కు నిదర్శనం.
 • 24 వేల మందికి అదనంగా ఇచ్చి 2.50 లక్షల మందికి రైతు బంధు ఈసారి ఇస్తున్నాం.
 • తెలంగాణ రైతు తన పంటకు తానే ధర నిర్ణయించుకోవాలనేది సీఎం కేసిఆర్ గారి లక్ష్యం.
 • అందుకోసం వ్యవసాయం కు కావాల్సిన 24 గంటల కరెంటు, ప్రాజెక్టుల ద్వారా నీరు ఇస్తున్నారు.
 • కొడంగల్ నియోజక వర్గంలో ప్రతి కుటుంబానికి వచ్చే 3 నెలల్లో పాడి పశువులు అందించాలి. దీనికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.
 • ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో పని కల్పించడానికి వివిధ రకాల పనులు కల్పించడం కోసం చెరువులు, కాలువల పూడిక తీత చేపట్టారు. ఇందుకు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని నిర్ణయించారు.
 • మీ శాసనసభ్యులు నిరంతరం ఈ నియోజక వర్గం అభివృధ్ధికి ఆలోచిస్తూ పని చేస్తున్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)