రైతును ఆర్థికంగా పరిపుష్టం చెయ్యడమే సీఎం కేసీఆర్‌ సంకల్పం: మంత్రి ఇంద్రకర్ రెడ్డి

Fri, Jun 19, 2020, 12:30 PM
Related Image
  • రైతులను సంఘటితం చేసేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయి
  • డిమాండ్ ఉన్న పంటలను వేసి లాభాలను గడించాలి
  • రైతు వేదికను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
  •  సొంత నిధులతో  రైతు వేదికను నిర్మిస్తానని ప్రకటించిన మంత్రి అల్లోల
నిర్మల్, జూన్ 19:  రైతును ఆర్థికంగా పరిపుష్టం చెయ్యడమే సీఎం కేసీఆర్‌ సంకల్పమని, అందుకే  రైతు సంక్షేమం కోసం ఆయన అనేక పథకాలను అమలు చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం న్యూ పోచం పహాడ్ లో అక్కపూర్ క్లస్టర్ రైతు వేదిక భవన నిర్మాణానికి  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి భూమిపూజ చేశారు. రైతు వేదికల నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుుమేరకు రూ.22 లక్షల వ్యయంతో తన సొంత నిధులతో దివంగత  అల్లోల చిన్నమ్మ- నారాయణ రెడ్డిల స్మారకార్ధం ఈ వేదికను నిర్మిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నదాతలను ఆదుకునేందుకే రుణాల మాఫీ, రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశ పెట్టి ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేసి ఆర్థికంగా బలపడాలని సూచించారు. రైతులందరూ ఒకచోట చేరి సాగు విధానాలపై చర్చించుకోవడానికి వీలుగా ‘రైతు వేదిక’లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. దీంతో  రైతు శిక్షణ కార్యక్రమాలను చెట్ల కింద, పంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించే కష్టాలు తప్పనున్నాయని వెల్లడించారు.

రైతు వేదిక కార్యక్రమం ద్వారా క్లస్టర్ లోని రైతులందరికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్ట మొదటి రైతు వేదికను నిర్మల్ లో ప్రారంభించుకున్నామని తెలిపారు. గోదావరి నది ఆధారితంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నిర్మల్ జిల్లా సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)