రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన వారిని పరామర్శించిన తెలంగాణ మంత్రి పువ్వాడ

Wed, Jun 17, 2020, 09:17 PM
Related Image ఖమ్మం : ఆంధ్రపదేశ్ కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులైన వారు ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. మధిర నియోజకవర్గం లోని ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అదుకుంటుందన్నారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రమాదంలో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

న్యూరో సంబంధిత చికిత్స కోసం మమత ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్సను అందిస్తామని అధికారులతో మాట్లాడినట్లు వివరించారు. మృతుల కుటుంబాన్నికి తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా మధిర వాసులు దుర్మరణం చెందడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారని తెలిపారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. మంత్రి వెంట మేయర్ పాపాలాల్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, DM&HO డా.మాలతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ బి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.

X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)