కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబుకు నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ

Wed, Jun 17, 2020, 09:10 PM
Related Image ఖమ్మం: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం ఖమ్మం జడ్పీ హాల్ నందు సర్వసభ్య సమావేశంకు హాజరైన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తొలుత హాల్ ఆవరణంలో కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దేశం కోసం సంతోష్ చేసిన ప్రాణ త్యాగానికి యావత్ భారతావని సెల్యూట్  చెబుతుందన్నారు. నివాళులు అర్పించిన వారిలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తదితరులు.
 
ఖమ్మం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంకు ముఖ్య అతిధిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరైన్నారు. తొలుత హాల్ ఆవరణంలో కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమావేశం కు ముందు దేశం కోసం సంతోష్ చేసిన ప్రాణ త్యాగానికి ఆశ్రునివాళులు అర్పిస్తూ సభ్యలందరితో కలిసి 2 నిమిషాలు మంత్రి మౌనం పాట్టించారు. ఆనతరం సర్వసభ్య సమావేశం కొనసాగింది. ప్రస్తుత తరుణంలో మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కరోనా వైరస్ వ్యాప్తి నివరణ చర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. వైరస్ కట్టడిలో ముఖ్య పాత్ర పోషిస్తున్న కలెక్టర్ కర్ణన్ గారిని, జిల్లా యంత్రాంగంను అభినందించారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు. పాల్గొన్న అధికారులకు, ప్రజాప్రతినిధులకు కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు, వానాకాలం పంటలు, ఎరువులు, విత్తనాల లభ్యత, రైతు బంధు వేదికల నిర్మాణం తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, జిల్లా కలెక్టర్ RV కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి, జడ్పీ సీఈఓ ప్రియాంక, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, జిల్లా వ్యవసాయ అధికారి ఝాన్సీలక్ష్మీ కుమారి, DM&HO మాలతి, తదితరులు ఉన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)