దేవాలయాల ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే కాదు ప్రజలది కూడా!: ఏపీ దేవాదాయ శాఖా మంత్రి

Related image

దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కోసం చర్యల్లో భాగంగా త్వరలో దేవాలయ భూములు, భవనముల వివరాలను ఆన్ లైన్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ ను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆదేశించారు. దేవాలయాల ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే కాదు ప్రజలది కూడా అని మంత్రి అన్నారు. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయంలో శాఖ అధికారులతో మంత్రి ఈ రోజు సమావేశమయ్యారు. సమావేశంలో దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి జి.వి.ఎస్ ప్రసాద్, కమిషనర్ అర్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రంలో దేవాలయాలలో భక్తులను అనుమతించేందుకు డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టాలని మంత్రి చెప్పారు. డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాల ప్రకారం అన్ని దేవాలయాల్లో విధిగా ధర్మల్ గన్, సిబ్బంది బ్లౌజులు, మాస్కులు విధిగా ధరించాలని, శానిటేషన్ ఏర్పాటు చేసుకోవాలని, క్యూలైన్లలో ప్రతి భక్తునికి, భక్తునికి మధ్య భౌతిక దూరం ఉండే విధంగా మార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

ఇక శ్రీశైల దేవస్థానంలో జరిగిన అవకతవకలపై పోలీస్, సైబర్ క్రైమ్ తో విచారణ జరిపించాలని, బాధితులను తక్షణమే సస్పెండ్ చేయాలని మంత్రి ఆదేశించారు. అన్ని ప్రధాన దేవాలయాల్లో ఉన్న సాఫ్ట్ వేర్ ను ఏపీ టీఎస్ ద్వారా అనుసంధానం చేసుకోవాలన్నారు.

More Press Releases