విజయవాడ నగర అభివృద్ధికి ఐదు వందల కోట్లు విడుదల చేసిన సీఎం: దేవాదాయ శాఖ మంత్రి

Related image

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఈ రోజు విజయవాడ నగరంలోని 38వ డివిజన్ లో రూ.50.00 లక్షలతో నెహ్రు బొమ్మ సెంటర్ నుండి కోమల్ విలాస్ సెంటర్ వరకు నిర్మించనున్న సి.సి.రోడ్డుకు శంఖుస్ధాపన చేశారు. తర్వాత రూ.37.72 లక్షలతో కొత్తపేట చేపల మార్కెట్ భవనముల ఆధునీకరణ శంఖుస్ధాపన చేశారు. అనంతరం 39వ డివిజన్ లో రూ.50.00 లక్షలతో పులిపాటివారి వీధి, ఇమాంపంజా వీధి, వెలగలేటివారి వీధి, మేకలవారి వీధుల్లో నిర్మించనున్న సి.సి.రోడ్లకు శంకుస్ధాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత తెలుగుదేశం ప్రభుత్వం కేవలం రైతే రాజు అనే ప్రచారంతోనే పాలన సాగించిందని, సీఎం జగన్మోహన్ రెడ్డి రైతుని రారాజు చేశారని, రైతుకు కావలసినవన్నీ ఓకే చోట ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. 'గత టీడీపీ ప్రభుత్వంలో పురుగు మందు తాగిన రైతులను చూశాం. అప్పుడు రైతులు విత్తనాల నుంచి అన్నిటికీ ఇబ్బందులు గురయ్యారు' అని అన్నారు.

సీఎం జగన్ మోహన్ రెడ్డి చక్కని ప్రణాళికతో పని చేయడమే కాకుండా మంత్రులను, ఎమ్మెల్యేలతో పని చేయిస్తున్నారని, అధికారులను పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. నగర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధతో సీఎం జగన్ మోహన్ రెడ్డి వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం 500 కోట్ల రూపాయలు విడుదల చేశారన్నారు. కార్యక్రమంలో వైయస్సార్సీపీ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు పలువురు ఉన్నారు.

More Press Releases