వైద్యరంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసిన వ్యక్తి జగన్: ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు

Related image

విజయవాడ: చంద్రబాబుది మహానాడు కాదు.. మాయనాడు, వెన్నుపోటునాడు అని పేరు పెట్టుకుంటే బాగుంటుందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ఎద్దేవా చేశారు. శుక్రవారం విజయవాడ నగరంలోని బ్రాహ్మణ వీధిలోని దేవదాయ శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 178379  ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయన్నారు. ఇందులో సాంకేతిక కారణాల కారణంగా 15712 ఆరోగ్యశ్రీ కార్డులు పెండింగ్లో ఉన్నాయన్నారు. అదే విధంగా నగర పరిధిలో, రైస్ కార్డులు సర్కిల్ -1 కింద 73981, సర్కిల్ -2 కింద 69921, సర్కిల్ -3 లో 24317 మందికి కలిపి మొత్తంగా నగరపాలక సంస్థ పరిధిలో 168219 మందికి రైస్ కార్డులు వచ్చినట్లుగా తెలిపారు.

కరోనా సమయంలో స్వయం సహాయక గ్రూపు వారికి గ్రూప్ కి 50 వేల చొప్పున రుణాలు ఇచ్చినట్లు తెలిపారు. సర్కిల్ -1 లో 206 గ్రూపుల గాను 1, 03, 00, 000 రూపాయలు రుణం మంజూరు చేయడం అయిందన్నారు. సర్కిల్- 2 లో 211 గ్రూపుల గాను 1, 05, 50, 000 రూపాయల రుణం మంజూరు చేయడం జరిగింది. సర్కిల్ -3 లో 218 గ్రూపులో గాను 1, 09, 00, 000 రూపాయల రుణం మంజూరు చేయడం జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 635 స్వయం సహాయక గ్రూపులకు గానూ 3, 17, 50, 000 రూపాయల రుణం మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచి టీడీపీ తొలగించిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలో పేర్కొన్న 90శాతం హామీలను నెరవేర్చారని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తన మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌ లా భావిస్తుందన్నారు. పేద ప్రజలకు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఒక వరమని, పేదలందరికీ వైద్యం అందించాలన్నదే సీఎం జగన్‌ ధ్యేయమని మంత్రి పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా హెల్త్‌కార్డులు వినియోగించుకునేలా వైఎస్‌ జగన్‌ సంకల్పించారని తెలిపారు. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో ప్రతి సంక్షేమ పథకంలోనూ, పేదల ఆరోగ్యంపై చంద్రబాబు అనేక స్కామ్‌లకు పాల్పడ్డారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగాన్ని సీఎం జగన్‌ పూర్తి ప్రక్షాళన  చేశారన్నారు. పేద ప్రజల డబ్బు వృధాకాకూడదని అందరికీ రైస్ కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డు లను విడివిడిగా పంపిణి చేస్తున్నారు. విజయవాడలో రైస్ కార్డ్స్ 168219 మందికి, ఆరోగ్య శ్రీ కార్డ్స్ 178379 మందికి కోత్తకార్డులు అందచేశామని మంత్రి అన్నారు.

More Press Releases