ap7am logo

రైతు కన్నీరు తుడిచేందుకే నూతన సాగు విధానం: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Wed, May 27, 2020, 04:10 PM
Related Image
 • తెలంగాణకు నిండైన ఆత్మ కేసీఆర్ 
 • డిమాండ్ ఉన్న పంటల సాగుతోనే లాభసాటి వ్యవసాయం
 • ఎల్లంపేట రైతుల సమిష్టి నిర్ణయం ఉభయ జిల్లాలకు ఆదర్శం
 • లాభసాటి వ్యవసాయ విధానంపై సదస్సులో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఎల్లంపేటలో లాభసాటి వ్యవసాయ విధానంపై జరిగిన రైతు సదస్సులో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ & శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మంత్రి సమక్షంలో లాభసాటి వ్యవసాయం చేస్తామంటూ 10 గ్రామ పంచాయతీలు తీర్మానం చేశాయి. మంత్రి వారిని ప్రత్యేకంగా అభినందించారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్:
 • కామారెడ్డికి త్వరలో కాళేశ్వరం జలాలు. మంచిప్ప ద్వారా ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు గోదావరి జలాలు. కేసీఆర్ ఆదేశాల మేరకు స్వయంగా పనులను పర్యవేక్షిస్తున్నా
 • తెలంగాణ రాష్ట్రంలో అమలవుతోన్న పథకాలన్నీ ఉద్యమ కాలంలో కేసీఆర్ రూపొందించుకున్న ముందస్తు ప్రణాళికలో భాగమే. కరెంట్ సమస్యను రెండేళ్లలో తీర్చారు. కాళేశ్వరంతో సాగు నీళ్లు అందిస్తున్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతోంది
 • కామారెడ్డిలో గతంలో కరెంట్ కోసం అత్యధికంగా రైతులే ధర్నాలు చేసేది. ఇప్పుడు ధర్నాల్లేవ్. రాస్తా రోకోల్లేవ్
 • కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు, పంటల కొనుగోళ్లు చేయడం ఆషామాషి కాదు. 12వేల కోట్లతో 25వేల రుణం కలిగి ఉన్న రైతన్నలకు రుణమాఫీ చేయడం గొప్ప విషయం
 • వ్యవసాయ విధానం ద్వారా రైతులకే మేలు. లాభసాటి సాగు ద్వారా ఆరుగాలం కష్టానికి ఫలితం దక్కుతుంది. కరెంట్, నీళ్లు, విత్తనాలు, ఎరువులు వచ్చినంక పంట దిగుబడులు పెరిగాయి
 • భవిష్యత్తులో పంటలను ఆర్థిక పరిస్థితి బాగోలేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనలేకపోతే రైతుల పరిస్థితి ఏంటన్నది ఆలోచించాలి. అందుకే డిమాండ్ ఉన్న పంటలేస్తే సమస్యలే ఉండబోవు
 • దేశంలో ఈ తరహా ప్రయోగం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతుంది. భవిష్యత్తులో 3 నెలల ముందుగానే సాగుదారులకు వ్యవసాయ కార్డులు జారీ
 • ఇప్పటి వరకు కేసీఆర్ ముట్టుకున్న ప్రతీ పని మంచిగనే అయ్యింది. ప్రతిపక్షాల పసలేని ఆరోపణలు. రైతును బాగు చేస్తుంటే ఓర్వలేక రాజకీయాలు
 • తెలంగాణకు దెబ్బ తగిలినా చిన్న గీత పడినా విలవిల్లాడే వ్యక్తి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్ కు ప్రాణం కంటే ఎక్కువ. పేదలు, రైతులను బాగు పర్చడం ద్వారా బంగారు తెలంగాణ సాధ్యమని భావించే వ్యక్తి మన ముఖ్యమంత్రి
 • గిరిజనుల అటవీ భూముల సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది" అని మంత్రి అన్నారు 
ఈ సదస్సులో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, జడ్పీ ఛైర్మన్ దఫేదార్ శోభ, డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి, ఎంపీపీ నర్సింగరావు, రైతుబంధు సమితి బాధ్యులు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Articles (Education)